📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Pratyusha: నటి ప్రత్యూష మృతి కేసు.. తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

Author Icon By Aanusha
Updated: November 20, 2025 • 10:29 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన  సినీ నటి ప్రత్యూష (Pratyusha) మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైకోర్టు విధించిన జైలుశిక్షను సవాల్‌ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి, నిందితుడికి విధించిన శిక్షను పెంచాలంటూ ప్రత్యూష తల్లి సరోజినీదేవి దాఖలు చేసిన క్రిమినల్‌ అప్పీళ్లపై జస్టిస్‌ రాజేశ్‌ బిందల్, జస్టిస్‌ మన్మోహన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం తమ తీర్పును రిజర్వ్‌ చేసింది.

Read Also: Upasana: “పెళ్లి–కెరీర్‌కి పోటీ లేదు” అని చెప్పిన ఉపాసన

కేసు వివరాలు

జస్టిస్‌ రాజేశ్‌ బిందల్, జస్టిస్‌ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.హైదరాబాద్‌లో ఇంటర్ చదివే రోజుల్లో ప్రత్యూష (Pratyusha), సిద్ధార్థ రెడ్డి ప్రేమించుకున్నారు. 2002 ఫిబ్రవరి 23న వీరిద్దరూ పురుగుమందు తాగిన స్థితిలో ఆసుపత్రిలో చేరగా, చికిత్స పొందుతూ మరుసటి రోజు ప్రత్యూష మరణించింది.

సిద్ధార్థ రెడ్డి కోలుకున్నాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ, ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలతో (సెక్షన్ 306) సిద్ధార్థ రెడ్డిపై ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.ఈ కేసును విచారించిన హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు 2004లో సిద్ధార్థ రెడ్డికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

Actress Pratyusha case.. Supreme Court reserves verdict

తీర్పు రిజర్వ్

దీనిపై నిందితుడు హైకోర్టును ఆశ్రయించగా, 2011లో ఉన్నత న్యాయస్థానం శిక్షను రెండేళ్లకు తగ్గించి, జరిమానాను రూ. 50 వేలకు పెంచింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థ రెడ్డి, శిక్షను పెంచాలని కోరుతూ ప్రత్యూష తల్లి సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు.

సుప్రీంకోర్టులో సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రత్యూషను ఆత్మహత్యకు పురికొల్పినందుకు నిందితుడికి గరిష్ఠ శిక్ష విధించాలని కోరారు. అయితే, నిందితుడి తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. ఇద్దరూ కలిసే విషం తాగారని, కాబట్టి ఇది ఆత్మహత్యకు ప్రేరేపించడం కిందకు రాదని తెలిపారు. 

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News latest news Pratyusha case Supreme Court Pratyusha death case Pratyusha mother Siddhartha Reddy appeal Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.