బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ (Bangladesh women’s cricket) జట్టులో సీనియర్ ప్లేయర్ జహానారా ఆలం (Jahanara Alam) తన కెప్టెన్ నిగార్ సుల్తానా జోటి (Sultana Joti) పై సంచలన ఆరోపణలు చేయడంతో క్రికెట్ వర్గాలు షాక్‌కు గురయ్యాయి. జూనియర్ ప్లేయర్లను కెప్టెన్ శారీరకంగా హింసిస్తోందని, చితకబాదుతోందని ఆమె ఆరోపించడం కలకలం రేపుతోంది. జట్టులో పక్షపాతం, అనారోగ్యకర వాతావరణం కూడా ఉందని ఆమె విమర్శించింది.
Read Also: Gurvinder Singh: కబడ్డీ ప్లేయర్ ను కాల్చి చంపిన బిష్ణోయ్ గ్యాంగ్
మహిళల ప్రపంచకప్ (Women’s World Cup) సమయంలో భారతదేశంలో జరిగిన మ్యాచ్ సమయంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని ఆరోపించింది. బంగ్లాదేశ్ పత్రిక కలర్ కంఠాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జహానారా మాట్లాడుతూ జోటి జూనియర్ ఆటగాళ్లను కొట్టడం జట్టులో అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ అని తెలిపింది. “ఇది కొత్త విషయం కాదు.
జోటి (Sultana Joti) తరచూ జూనియర్లను కొడుతుంది. ఈ ప్రపంచకప్‌లో కూడా కొందరు జూనియర్లు నాకు చెప్పారు. ‘ఇక నేను అలా చేయను, లేకపోతే మళ్లీ చెంపదెబ్బ తింటాను’ అని కొందరు నాతో చెప్పారు. దుబాయ్ టూర్ సమయంలో కూడా ఆమె ఒక జూనియర్‌ని గదికి పిలిచి చెంపదెబ్బ కొట్టింది” అని జహానారా ఆరోపణలు చేసింది.
శారీరక దాడి మాత్రమే కాకుండా
కేవలం శారీరక దాడి మాత్రమే కాకుండా, జట్టులో తీవ్రమైన పక్షపాతం, అంతర్గత రాజకీయాలు నడుస్తున్నాయని కూడా ఆమె ఆరోపించింది. “ఈ బాధితుల జాబితాలో నేను ఒక్కదాన్నే లేను. దాదాపు అందరూ బాధితులే.
2021 నుంచే నాతో పాటు మరికొందరు సీనియర్లను పక్కన పెట్టేందుకు ప్రయత్నాలు జరిగాయి. జట్టులో కొందరికి మాత్రమే ప్రాధాన్యత దక్కుతోంది” అని ఆమె వ్యాఖ్యానించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: