శ్రీ సత్యసాయి జిల్లా(Sathya Sai District) వ్యాప్తంగా గురువారం నాలుగు వేర్వేరు చోట్ల జరిగిన ఘటనల్లో నలుగురు వ్యక్తులు ఆత్మహత్య(Suicide) చేసుకున్నారు. వ్యక్తిగత సమస్యలు, అనారోగ్యం, మానసిక ఒత్తిళ్లే ఈ దుర్ఘటనలకు కారణాలుగా ప్రాథమికంగా తెలుస్తోంది.
Read Also: Sukhwinder Singh Sukhu: హిమాచల్‌ప్రదేశ్ సీఎంకు బాంబు బెదిరింపు?
కదిరి, అగళి, తనకల్లు, బుక్కపట్నంలో ఘటనలు
కదిరి పట్టణానికి చెందిన మున్ని (42) కుటుంబ కలహాలు, భర్త వేధింపులను తట్టుకోలేక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అగళి మండలంలో భూమిక (19) టీబీ వ్యాధితో కొంతకాలంగా బాధపడుతూ తీవ్ర మనస్తాపానికి లోనై పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయింది.
తనకల్లు మండలంలో నివాసం ఉంటున్న ఫరియాద్ (60) అనారోగ్య సమస్యలు, కుమారుడు ఇటీవల మృతి చెందడంతో తీవ్ర మానసిక వేదనకు గురై ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో ఘటనగా బుక్కపట్నం మండలం నార్సింపల్లి గ్రామానికి చెందిన జగదీశ్ (23) అటవీ ప్రాంతంలో ఉరి వేసుకుని మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.
కేసులు నమోదు చేసి దర్యాప్తు
ఈ నాలుగు ఘటనలపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనల వెనుక గల అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: