📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Odisha: ప్రొఫెసర్‌ లైంగిక వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య.. ఖండించిన ప్రతిపక్షాలు

Author Icon By Vanipushpa
Updated: July 15, 2025 • 3:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒడిశా(Odisha)లో ప్రొఫెసర్‌ లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్య(Suicide) చేసుకున్న విద్యార్థిని మృతి చెందడంతో ప్రతిపక్ష పార్టీలు(opposition parties) భగ్గుమన్నాయి. ఇది ఆత్మహత్య కాదని, వ్యవస్థీకృత హత్య అని దుయ్యబట్టాయి. మాజీ ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్(Naveen patnaik​)తో పాటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) బీజేపీ తీరును తీవ్రంగా ఖండించారు. ఒడిశాలో ప్రొఫెసర్‌ లైంగిక వేధింపులు తాళలేక నిప్పంటించుకున్న 22 ఏళ్ల విద్యార్థిని 3 రోజులుగా ప్రాణాలతో పోరాడి ఓడిపోయింది. 95శాతం కాలిన గాయాలతో ఐసీయూలో చికిత్స పొందుతూ మృతిచెందింది.

Odisha:ప్రొఫెసర్‌ లైంగిక వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య.. ఖండించిన ప్రతిపక్షాలు

“ప్రభుత్వ వ్యవస్థ వైఫల్యం వల్ల ఒక ప్రాణం పోయిందని తలుచుకుని ఆవేదన చెందుతున్నాం. ఇది అత్యంత బాధాకరమైన విషయం. వాస్తవానికి ఇది ప్రమాదం కాదు. ఆమెకు సాయం చేయకుండా సైలెంట్​గా ఉన్న వ్యవస్థ వైఫల్యం వల్లే ఇలా జరిగింది. కళాశాల అధికారులు పట్టించుకోకపోయినా ఆమె ధైర్యం కోల్పోలేదు. న్యాయం కోసం కేంద్ర విద్యాశాఖ మంత్రిని, ముఖ్యమంత్రిని న్యాయం చేయాలని అడిగింది.
బీజేపీపై రాహుల్‌ గాంధీ ఆగ్రహం
కాగా, ఈ ఘటనపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందించారు. ఇది ఆత్మహత్య కాదని, వ్యవస్థీకృత హత్య అని బీజేపీపై మండిపడ్డారు. బాధితురాలిని రక్షించడంలో ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందంటూ రాహుల్‌ మంగళవారం ఎక్స్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం బాధిత విద్యార్థిని ధైర్యంగా, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా తన గొంతుకను వినిపించింది.

ఒడిశా లేదా మణిపుర్‌లో అయినా దేశంలో కుమార్తెలు కాలిపోతున్నారు

ఎప్పటిలాగే బీజేపీ వ్యవస్థ నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. ఒక అమాయకురాలైన విద్యార్థిని తనకు తాను నిప్పంటించుకునేలా చేసింది. ఇది ఆత్మహత్య కాదు వ్యవస్థీకృత హత్య. మోదీజీ ఒడిశా లేదా మణిపుర్‌లో అయినా దేశంలో కుమార్తెలు కాలిపోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. మీరు ఇంకా మౌనంగానే ఉంటారా? దేశానికి మీ మౌనం అవసరం లేదు. వీటన్నింటికీ సమాధానాలు కావాలి. భారతదేశ మహిళలకు భద్రత, న్యాయం కావాలి.
మహిళ భద్రతకు, న్యాయానికి బీజేపీ కృషి
ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్​. రాహుల్ గాంధీ చీప్​ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ఆరోపించారు. సున్నితమైన అంశాలను కూడా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. మహిళ భద్రతకు, న్యాయానికి బీజేపీ కృషి చేస్తుందని, కానీ కాంగ్రెస్​ మాత్రం ప్రతి ప్రమాదాన్ని అవకాశంగా తీసుకుంటుందని అన్నారు.
బాలేశ్వర్​లోని ఫకీర్ మోహన్ అటానమస్ కళాశాలలో బి.ఎడ్ చదువుతున్న విద్యార్థినిని ప్రొఫెసర్‌ సమీర్‌ కుమార్‌ సాహు లైంగికంగా వేధించాడు. దీనిపై ఆమె పలుమార్లు కళాశాల ఫిర్యాదుల కమిటీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్య తీసుకోలేదు. ఈ క్రమంలోనే జూలై 12న ఆమె కళాశాల ప్రాంగణంలోనే ప్రిన్సిపాల్ కార్యాలయం సమీపంలోని పరిగెత్తి పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమెను రక్షించబోయిన మరో యువతికి 65శాతం గాయాలవ్వగా ఆమె చికిత్స పొందుతోంది. పోలీసులు ప్రొఫెసర్‌తో పాటు కళాశాల ప్రిన్సిపాల్ దిలీప్ ఘోష్‌ను అరెస్టు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Syria clashes: సిరియాలో కొనసాగుతున్న మారణహోమం

#telugu News campus safety justice for student opposition reaction professor harassment Sexual Harassment Case Student suicide university scandal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.