Stray dogs attack boy in Guntur: గుంటూరులో బాలుడిపై కుక్కల దాడి

Read Time:  1 min
Stray dogs attack boy in Guntur: గుంటూరులో బాలుడిపై కుక్కల దాడి
FONT SIZE
GET APP

Stray dogs attack boy in Guntur:ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నగరంలో వీధి కుక్కలు మరోసారి విరుచుకుపడ్డాయి. నల్లచెరువు ప్రాంతంలో శనివారం జరిగిన ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఆరేళ్ల చిన్నారి ఫణీంద్ర రెడ్డి ఆడుకుంటుండగా, గుంపుగా వచ్చిన కుక్కలు ఒక్కసారిగా బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.

Read Also: Fire accident at KPHB Mobile Shop: కేపీహెచ్‌బీ మొబైల్ షాపులో అగ్నిప్రమాదం

Stray dogs attack boy in Guntur: Stray dogs attack boy in Guntur
Stray dogs attack boy in Guntur: Stray dogs attack boy in Guntur

జీజీహెచ్‌లో చికిత్స

కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమంగా మారింది. గమనించిన స్థానికులు కుక్కలను తరిమివేసి, వెంటనే బాలుడిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి (GGH) తరలించారు. ప్రస్తుతం వైద్యులు బాలుడికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. చిన్నారి పరిస్థితి చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. బాలుడి కుటుంబ సభ్యులను నగర పార్టీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా పరామర్శించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.