Srinagar Crime: శ్రీనగర్‌లో అగ్ని ప్రమాదం.. రెండు ఇళ్లు దగ్ధం

Read Time:  1 min
Srinagar Crime: శ్రీనగర్‌లో అగ్ని ప్రమాదం.. రెండు ఇళ్లు దగ్ధం
FONT SIZE
GET APP

Srinagar Crime: జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్ లో శుక్రవారం ఉదయం ఒక భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని లాల్‌చౌక్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న నివాస ప్రాంతంలో ఈ ప్రమాదం జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు చుట్టుపక్కల ప్రాంతాన్ని పూర్తిగా కమ్మేయడంతో, అక్కడ ఉన్న ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ దుర్ఘటనలో రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, తీవ్రంగా ప్రయత్నించి మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది.

Read Also: Kiren Rijiju : రాహుల్‌గాంధీపై కేంద్రమంత్రి రిజిజు తీవ్ర ఆరోపణలు

Srinagar Crime: Fire accident in Srinagar.. Two houses burnt down
Srinagar Crime: Fire accident in Srinagar.. Two houses burnt down

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.