ఎన్ని ఏళ్ళు గడిచినా నేషనల్ హెరాల్డ్ కేసు సోనియా (Sonia Gandhi), రాహుల్ గాంధీలను వదిలిపెట్టడం లేదు. దీనికి సంబంధించి కొత్త కేసులు పెడుతూనే ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీకి చిక్కులు మరింత పెరిగాయి. వీరిద్దరిపై క్రిమినల్ కుట్ర ఆరోపణలతో ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో మొత్తం ఆరుగురు వ్యక్తులు, మూడు కంపెనీలను నిందితులుగా చేర్చారు.
Read Also: Sri Lanka cyclone : శ్రీలంకను శోకసంద్రంలో ముంచిన దిత్వా తుపాను.. ఇప్పుడు భారత్ వైపు కదలికలు…
క్రిమినల్ కుట్ర పన్నారన్నది ప్రధాన ఆరోపణ
వీరితో పాటు శామ్ పిట్రోడా, మరో ముగ్గురు వ్యక్తుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. వీరితో పాటు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్), యంగ్ ఇండియన్, డోటెక్స్ మర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలపైనా కేసు నమోదైంది. నేషనల్ హెరాల్డ్ పత్రిక మాతృ సంస్థ అయిన ఏజేఎల్‌ను మోసపూరితంగా చేజిక్కించుకునేందుకు క్రిమినల్ కుట్ర పన్నారన్నది ప్రధాన ఆరోపణ.ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అందించిన దర్యాప్తు నివేదిక ఆధారంగా అక్టోబర్ 3న ఈ ఎఫ్ఐఆర్ దాఖలైంది.
కోల్‌కతాకు చెందిన డోటెక్స్ అనే షెల్ కంపెనీ నుంచి యంగ్ ఇండియన్ సంస్థకు రూ. కోటి అందిందని, ఈ నిధులతో కాంగ్రెస్ పార్టీకి రూ. 50 లక్షలు చెల్లించి, సుమారు రూ. 2,000 కోట్ల విలువైన ఏజేఎల్ ఆస్తులను యంగ్ ఇండియన్ నియంత్రణలోకి తీసుకుందని ఎఫ్ఐఆర్‌లో ఆరోపించారు. యంగ్ ఇండియన్‌లో సోనియా, రాహుల్ గాంధీలకు 76 శాతం వాటాలు ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: