📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Medak: ఫించన్‌ సొమ్ము కోసం తల్లిని చంపేసి కొడుకు

Author Icon By Vanipushpa
Updated: January 24, 2026 • 5:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వృద్ధురాలైన తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కుమారుడు మద్యానికి బానిసయ్యాడు. మత్తు కల్లుకు అలవాటు పడి దారుణానికి ఒడిగట్టాడు. ఫించన్‌ డబ్బులు, బంగారం కోసం చేయరాని నేరం చేశాడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిని చక్కగా చూసుకోవాల్సిన వాడు, తల కొరివి పెట్టే పరిస్థితికి దిగజారాడు. ఆశలన్నీ కుమారుడిపైనే : ఫించన్‌ డబ్బులు, బంగారం ఇవ్వలేదనే కోపంతో మద్యం మత్తులో ఉన్న కుమారుడు వృద్ధురాలైన తల్లిని దారుణంగా హత్య చేశాడు. నలుగురు సంతానంలో ఒక్కడే కుమారుడు కావడంతో ఆ తల్లి ఆశలన్నీ అతనిపైనే ఉన్నా, విచక్షణ మరిచిపోయాడు. పైగా తల్లికి నాటు వైద్యం చేయించానని బుకాయించాడు.

Read Also: Bhatti Vikramarka: సింగరేణి విష ప్రచారం పై భట్టి ఆగ్రహం

ఒంటిపై గాయాలతో అనుమానం

మెదక్ (Medak) జిల్లా రాజుపల్లి గ్రామం. 75 ఏళ్ల నరసమ్మకు నలుగురు సంతానం. ముగ్గురు కుమార్తెలు. ఓ కుమారుడు. వృద్ధురాలైన నర్సమ్మ కుమారుడి దగ్గరే ఉంటోంది. ఈ క్రమంలో ఓ రోజు తల్లి ఆరోగ్యం బాగా లేదని చెప్పిన కుమారుడు రాములు, నాటు వైద్యం చేయించానని తన సోదరీమణులకు చెప్పాడు. నర్సమ్మ గచ్చులో జారి పడిందని చెప్పాడు. అప్పటికే రాములుపై అనుమానం ఉన్న నర్సమ్మ కుమార్తెలు తల్లిని పరిశీలించగా చనిపోయినట్లు తెలిసింది. కాళ్లు, చేతులు, తల, ముఖంపై గాయాలు ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రాములును విచారించగా అసలు విషయం బయటపడింది. తల్లిని రాములు అతి దారుణంగా కొట్టి చంపాడని తేలింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Crime News criminal case india domestic crime family dispute financial dispute crime Murder case police investigation shocking crime son kills mother Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.