📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Telugu News: Shad Nagar: ఇన్నోవా కారులోనే రాజశేఖర్ హత్య!

Author Icon By Sushmitha
Updated: November 18, 2025 • 12:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

షాద్ నగర్ (రంగారెడ్డి జిల్లా): దళిత యువకుడు రాజశేఖర్ కిడ్నాప్, హత్య ఉదంతంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ (Shad Nagar) పోలీసులు పురోగతి సాధించారు. రాజశేఖర్‌ను హతమార్చి, శవాన్ని దహనం చేసిన ఘటనలో పోలీసులు ఎనిమిది మందిని నిందితులుగా గుర్తించారు. ఇందులో ఏడుగురిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు షాద్ నగర్ ఏసీపీ ఎస్. లక్ష్మీనారాయణ, టౌన్ సీఐ విజయ్ కుమార్ తెలిపారు.

Read Also: Modi: నేడు సిఎం, రేపు ప్రధాని సత్యసాయి జయంతి వేడుకలకు రాక

Shad Nagar: Rajasekhar was murdered in his Innova car!

హత్యకు కారణం, పథకం

ఈ హత్యకు ప్రధాన కారణం కుటుంబ పరువు, పగ. హత్యకు గురైన రాజశేఖర్ (Rajasekhar) సోదరుడు చంద్రశేఖర్, ప్రధాన నిందితుడు కాగుల వెంకటేష్ కూతురు భవాని ఇరువురి మధ్య ప్రేమ వ్యవహారంలో గతంలో మొయినాబాద్ (Moinabad) పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రాజశేఖర్ తన సోదరుడు చంద్రశేఖర్‌కు మద్దతు ఇస్తుండటంతో, తక్కువ కులం వాడికి మద్దతిస్తున్న రాజశేఖర్‌ను ఎలాగైనా చంపాలని వెంకటేష్ నిర్ణయించుకున్నాడు.

హత్య జరిగిన తీరు, నిందితులు

వెంకటేష్, మరో ముగ్గురు కలిసి ఈ నెల 12వ తేదీన రాత్రి 11 గంటల సమయంలో రాజశేఖర్‌ను ఇంటి నుంచి బయటకు పిలిచి కిడ్నాప్ చేశారు. ఇన్నోవా కార్‌లో (Innova car) ఎక్కించుకుని అన్నారం జంక్షన్ వైపు వెళ్లారు. ఇన్నోవా కారులోనే రాజశేఖర్ గొంతును తీసుకువచ్చిన నైలాన్ తాడుతో రెండు వైపులా బిగించి చంపారు. హత్య తర్వాత, రామేశ్వరం వైపు వెళ్లి, నవాబుపేట సరిహద్దుల్లోని ఒక నిర్మానుష్య ప్రదేశంలో రాజశేఖర్ మృతదేహంపై ఆరు లీటర్ల పెట్రోలు పోసి అగ్గిపెట్టెతో నిప్పంటించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

caste killing Google News in Telugu kidnapping Latest News in Telugu Murder case Police Arrest Ranga Reddy district. Shadnagar crime Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.