సికింద్రాబాద్‌లో మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. 13 ఏళ్ల మైనర్ బాలికను మాయమాటలు చెప్పి లాడ్జికి తీసుకెళ్లి నలుగురు యువకులు దాడికి పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. బాధితురాలు కనిపించకపోవడంతో తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, సెల్‌ఫోన్ సిగ్నల్‌లను ట్రేస్ చేసి బాలికను సికింద్రాబాద్‌లోని (secunderabad) ఓ లాడ్జిలో కనుగొన్నారు. అక్కడే నాలుగు మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Read also: global summit 2025: రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. రెండో రోజు భారీగా పెట్టుబడులు
Gang rape of a 13-year-old girl in Secunderabad
బాలిక ఈ నెల 4న కనిపించకపోవడంతో
నిందితుల్లో ఇద్దరు 19 ఏళ్ల వయస్సు కలిగిన యువకులు కాగా, మరో ఇద్దరు 17 ఏళ్ల మైనర్లు అని పోలీసులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన బాలిక ఈ నెల 4న కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో, ఈ నెల 8న సికింద్రాబాద్ బస్ స్టేషన్ వద్ద ఒంటరిగా ఉన్న బాలికను నిందితులు గుర్తించి, నమ్మబలికి లాడ్జికి తీసుకెళ్లినట్లు బయటపడింది. నిందితులపై పోక్సో చట్టం సహా సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: