📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు

Telugu news: Sangareddy crime: పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు

Author Icon By Tejaswini Y
Updated: December 11, 2025 • 12:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సంగారెడ్డిలో ప్రేమ ఘర్షణ దారుణం

B-Tech student murder: ప్రేమ వ్యవహారం నేపథ్యంలో మరో యువకుడు దుర్మరణం చెందాడు. తమ కూతురితో ప్రేమలో ఉన్నాడనే కారణంతో బీటెక్ విద్యార్థిని క్రూరంగా హతమార్చిన సంఘటన సంగారెడ్డి(Sangareddy crime) జిల్లాలో సంచలనం రేపుతోంది. పెళ్లి విషయంపై మాట్లాడుకుందామని నమ్మించి ఇంటికి పిలిచిన తర్వాతే ఈ ఘోరం జరిగిందని యువకుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also: AP Crime: నకిలీ మద్యం కేసులో గోవా వ్యాపారి బాలాజీకే అధిక చెల్లింపులు

Sangareddy crime: They killed him by promising to marry him

అమీన్‌పూర్‌లో ప్రేమ వివాదం విషాదం

అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరంగూడ సృజన లక్ష్మీ నగర్‌లో జరిగిన ఈ ఘటనలో శ్రవణ్ సాయి (20) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఎన్టీఆర్ జిల్లా(NTR Distt) పెనుగంచిప్రోలు అతడి స్వస్థలం. ప్రస్తుతం కుత్బుల్లాపూర్‌లో అద్దె గదిలో ఉంటూ మైసమ్మగూడలోని సెయింట్ పీటర్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.

బీరంగూడ ఇసుకబావికి చెందిన శ్రీజ (19)తో సాయి కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి రావడంతో ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసింది. పలుమార్లు హెచ్చరించినా ప్రేమ వ్యవహారం ఆగకపోవడంతో వారు కుతంత్రం పన్నారు.

పెళ్లి మాటలతో మభ్యపెట్టి యువకుడి హత్య

పెళ్లి విషయంపై మాట్లాడుకుందామని నమ్మించి తమ ఇంటికి పిలిపించుకున్నారు. యువతి కుటుంబ సభ్యులు, అతడు రాగానే అకస్మాత్తుగా అతడిపై దాడి చేసి బ్యాటుతో కొట్టి చంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం మృతదేహాన్ని పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అమీన్‌పూర్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aminpur police limits Beeramguda murder case BTech student killed Love affair murder Sangareddy crime news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.