📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: Sameer Modi – లలిత్ మోదీ సోదరుడు సమీర్ మోదీ అత్యాచారం ఆరోపణలతో అరెస్ట్

Author Icon By Anusha
Updated: September 19, 2025 • 11:40 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ (Lalit Modi) సోదరుడు, వ్యాపారవేత్త సమీర్ మోదీ పై తీవ్రమైన నేర ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో భాగంగా ఢిల్లీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్లు సమాచారం. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సమీర్ మోదీని అదుపులోకి తీసుకున్నట్లు ఓ సీనియర్ పోలీస్ అధికారి  వెల్లడించారు.

ఐదు రోజుల క్రితం ఓ మహిళ సమీర్ మోదీ (Sameer Modi) పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో తాను లైంగిక దాడి, క్రిమినల్ బెదిరింపులకు గురయ్యానని ఆమె ఆరోపించింది. తనపై సమీర్ మోదీ లైంగిక దాడి చేశాడని, తర్వాత తనను బెదిరించాడని పేర్కొంటూ ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ పోలీసులు అత్యాచారం, క్రిమినల్ ఇంటిమిడేషన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Sameer Modi

ఆయన తన తల్లి బినా మోదీతో ఆస్తి వివాదం

సమీర్ మోదీ, ప్రముఖ డైరెక్ట్ సెల్లింగ్ సంస్థ ‘మోదీకేర్’ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. గత కొంతకాలంగా ఆయన తన తల్లి బినా మోదీ (Bina Modi) తో ఆస్తి వివాదం కారణంగా కూడా వార్తల్లో నిలుస్తున్నారు. వారి కుటుంబ పెద్ద కేకే మోదీ 2019లో మరణించిన తర్వాత, సుమారు రూ.11,000 కోట్ల వారసత్వ ఆస్తి పంపకాల విషయంలో తల్లితో ఆయనకు విభేదాలు తలెత్తాయి.

తన తండ్రి రాసిన ట్రస్ట్ డీడ్ ప్రకారం ఆస్తులు పంచడంలో తల్లి విఫలమయ్యారని ఆరోపిస్తూ సమీర్ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ కుటుంబ కలహాల నేపథ్యంలో తన తల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ గతంలో ఆయన ఢిల్లీ పోలీసులను ఆశ్రయించడం గమనార్హం.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ap-liquor-case-ed-checks-in-5-states-in-ap-liquor-case/andhra-pradesh/550108/

Breaking News businessman samir modi criminal intimidation delhi police arrest igi airport detention lalit modi brother latest news Rape case Telugu News woman complaint

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.