RTC Driver Attack: పల్నాడు జిల్లా గురజాలలో ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్‌పై దాడి ఘటన కలకలం రేపింది. మాచర్లకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును మాడుగుల అడ్డరోడ్డు వద్ద ఆపాలని ఓ మహిళ కోరినట్లు సమాచారం. అయితే అక్కడ బస్సు ఆపకుండా కొంత దూరం వెళ్లిన తర్వాత డ్రైవర్ బస్సును నిలిపినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహానికి గురైన మహిళ, ఆమె కుటుంబ సభ్యులు తిరుగు ప్రయాణంలో ఉన్న అదే బస్సును అడ్డుకుని డ్రైవర్, కండక్టర్‌పై దాడికి పాల్పడినట్లు సమాచారం. బస్సును అడ్డుకున్న అనంతరం కోడిగుడ్లు, కర్రలతో ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేసినట్లు తెలుస్తోంది.
Read Also :Missouri Road Accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి
డ్యూటీ మారిన సిబ్బందిపై దాడి
ఈ ఘటనలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రయాణికురాలితో మొదట జరిగిన ఘటన సమయంలో విధుల్లో ఉన్న డ్రైవర్, కండక్టర్ కాకుండా.. ఆ తర్వాత డ్యూటీ మారిన సిబ్బందిపైనే దాడి జరిగినట్లు సమాచారం. అంటే, మొదట బస్సులో ప్రయాణించిన సిబ్బంది కాకుండా డ్యూటీ మారిన డ్రైవర్, కండక్టర్ ఈ దాడికి గురయ్యారు.
RTC Driver Attack: పోలీసులకు ఫిర్యాదు
ఈ ఘటనపై కండక్టర్ సోమయ్య గురజాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడికి దారితీసిన పరిస్థితులు, ఘటనలో పాల్గొన్న వ్యక్తుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :