విశాఖపట్నం లో ఘోర ప్రమాదం – ఇద్దరు యువకుల మృతి
విశాఖపట్నం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం దీపావళి వేళ విషాదాన్ని మిగిల్చింది. పాత గాజువాక జంక్షన్ వద్ద నిన్న అర్ధరాత్రి ఓ మోటార్ సైకిల్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం, మృతులు(Road accident) కూర్మన్నపాలెం ప్రాంతానికి చెందిన అజయ్ రాజు మరియు మనోజ్ కుమార్ గా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి(Public hospital) తరలించారు.
Read also: గ్రానైట్ లారీ బీభత్సం – పెను ప్రమాదం తప్పింది
అతివేగమే ప్రమాదానికి కారణం – పోలీసులు ముందస్తు నివేదిక
పోలీసుల ప్రాథమిక విచారణలో మోటార్ సైకిల్ అధిక వేగంతో ప్రయాణించడమే ప్రమాదానికి దారి తీసినట్లు గుర్తించారు. అదుపు కోల్పోయిన బైక్ (Road accident)(Road accident) డివైడర్‌ను బలంగా ఢీకొనడంతో యువకులు తలపై తీవ్ర గాయాలుకు గురై ప్రాణాలు కోల్పోయారు. దీపావళి పండుగ సంబరాల మధ్య ఇలా ఇద్దరు యువకుల అకాలమరణం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదాల నివారణకు యువత వేగం నియంత్రణపై జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: