📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Riots Case: ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులకు బెయిల్ తిరస్కరణ

Author Icon By Pooja
Updated: January 5, 2026 • 2:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

2020 సంవత్సరంలో ఢిల్లీలో(Riots Case) జరిగిన ఆర్లర్లు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. పౌరసత్వం చట్టం సవరణ కోరుతూ పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. అయితే ఈ అల్లర్ల కేసులో 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఫిబ్రవరి 2020 అల్లర్ల కేసులో బెయిల్ నిరాకరిస్తూ సెప్టెంబరు 2న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం విచారించిన సుప్రీం ధర్మాసనం కూడా నిందితులు ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్ లకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

Read also: Siddipet crime: సిద్దిపేట మెడికల్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య

అసలు గొడవ ఏమిటి?

2020లో పౌరసత్వం (సవరణ) చట్టం (సిఎఎ)కు వ్యతిరేకంగా ఢిల్లీలో(Riots Case) పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. రోజుల తరబడి ఉద్రిక్తలు నడిచాయి. ఈ కేసులో ఉమర్ ఖలీద్ ను అదుపులోకి తీసుకుని సెప్టెంబర్ 13, 2020 నుంచి కస్టడీలో ఉంచారు. ఇక ఇమామ్ జనవరి 28,2020 నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. ఢిల్లీ అల్లర్లు చెలరేగడానికి కొన్ని వారాల ముందు నుంచే జైల్లో ఉన్నాడు.

ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు

ఫిబ్రవరి 2020లో ఈశాన్య ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఆల్లర్లు జరిగాయి. చాలారోజులు కొనసాగిన ఈ హింసకు అనేకమంది మరణాలకు దారితీసింది. ఇళ్లు, దుకాణాలు, ప్రార్థనా స్థలాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. అయితే పరిపాలనను అస్థిరపరిచేందుకు నిందితులు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నం చేశారని ఆరోపణలు ఉన్నాయి. పాలన మార్పుతో పాటు దేశమంతటా కుట్రకు పాల్పడినట్లుగా పోలీసులు ఆరోపించారు. అయితే ఈ కేసులో నిందితులుగా ఉన్న గుల్పిషా ఫాలిమా, మీరాన్ హైదర్, ఫిసా ఉర్ ఎమమాన్, మహ్మద్ సలీమ్ ఖాన్, షాదాబ్ అహ్మద్ అనే మరో ఐదుగురికి మాత్రం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్వీ అంజరియాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. అయితే ఖలీద్, ఇమామ్ లకు మాత్రం బెయిల్ నిరాకరించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Google News in Telugu Latest News in Telugu SupremeCourtVerdict UmarKhalid

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.