📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Rekha Gupta: ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పై దాడికి యత్నం

Author Icon By Anusha
Updated: August 20, 2025 • 10:43 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఢిల్లీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపే ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Rekha Gupta) తన అధికారిక నివాసంలో ప్రజల సమస్యలు తెలుసుకునే “జన్ సున్వాయ్” కార్యక్రమం నిర్వహిస్తుండగా, ఒక వ్యక్తి అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఒక్కసారిగా అక్కడి వాతావరణాన్ని ఉద్రిక్తంగా మార్చింది.రేఖా గుప్తా ప్రజల సమస్యలు స్వయంగా వింటూ పరిష్కారం చూపేందుకు అధికారిక నివాసంలో ప్రతి వారం ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో వందలాది మంది పౌరులు హాజరై తమ వినతిపత్రాలు సమర్పిస్తుంటారు. మంగళవారం కూడా ఇలాగే ప్రజలు క్యూలలో నిలబడి తమ సమస్యలు చెప్పుకుంటూ ఉండగా, ఒక వ్యక్తి ముందుకు వచ్చి వినతిపత్రం ఇచ్చాడు.

Rekha Gupta

భద్రతా సిబ్బంది

మొదట సాధారణంగానే కనిపించిన అతను,గట్టిగా అరిచి, సీఎం రేఖా గుప్తా చెంపపై కొట్టాడు. అంతటితో ఆగకుండా ఆమె జుట్టు పట్టుకుని పీకాడు.ఈ సంఘటన క్షణాల్లోనే అక్కడ ఉన్న భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసింది. వెంటనే వారు దుండగుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. దాడి సమయంలో అక్కడ ఉన్న అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్‌ (Virendra Sachdev), మంత్రి మజిందర్ సింగ్ సిస్రా, ఇతర నేతలు ఈ దాడి వెనక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. కాగా, ముఖ్యమంత్రిపై దుండగుడి దాడి ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అతిశీ స్పందించారు. సీఎంపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ప్రజాస్వామ్యంలో దాడులకు చోటులేదని ఆమె పేర్కొన్నారు. దాడికి పాల్పడ్డ దుండగుడిని పోలీసులు విచారిస్తున్నారు. భద్రతా వైఫల్యంపైనా దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం.

రేఖా గుప్త ఎవరు? ఆమె చరిత్ర ఏంటి?

రేఖా గుప్త (జిందాల్; జూలై 19, 1974 జననం) భారతీయ రాజకీయ నాయకురాలు. ఆమె 2025 ఫిబ్రవరి నుండి ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన రేఖా గుప్త 2025లో శాలిమార్ బాగ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజకీయాల్లో చురుకైన నాయకురాలిగా ఆమె ఢిల్లీ రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/bomb-threats-bomb-threats-to-delhi-schools/national/532944/

Breaking News Delhi CM Rekha Gupta Delhi Politics jan sunwai program latest news rekha gupta attack rekha gupta incident rekha gupta news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.