📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Red Sandalwood: ఎర్రచందనం స్మగ్లింగ్ను అడ్డుకున్న గ్రామస్తులు

Author Icon By Sushmitha
Updated: November 15, 2025 • 11:05 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పెద్దపంజాణి (చిత్తూరు జిల్లా): కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం(Red Sandalwood) దుంగలను అటవీ అధికారుల సమాచారంతో గ్రామస్తులు అడ్డుకున్న సంఘటన శుక్రవారం వేకువజామున చిత్తూరు జిల్లా, పెద్దపంజాణి మండలంలోని అప్పినపల్లిలో చోటుచేసుకుంది. ఈ సంఘటనతో మండలంలో కలకలం రేగింది. గుర్తు తెలియని స్మగ్లర్లు ఒక కారులో రూ.7 లక్షల విలువ చేసే పది ఎర్రచందనం దుంగలను పులిచెర్ల నుంచి కర్ణాటకకు తరలిస్తున్నారు.

Read Also: IND vs SA: తొలి రోజు ఆటలో గెలుపు టీమిండియాదే

Red Sandalwood

పోలీసుల సమన్వయం, స్మగ్లర్లు పరార్

పోలీసులు, అటవీ అధికారులకు సమాచారం రావడంతో వారు స్మగ్లర్ల(Smugglers) వాహనాన్ని వెంబడించారు. అయితే దుండగులు వాహనాన్ని ఆపకుండా ముందుకు నడపసాగారు, ఈ క్రమంలో మార్గమధ్యలో ఒక వ్యక్తిని ఢీకొట్టబోయారు. ఈ విషయాన్ని పలమనేరు ఎస్‌ఆర్‌వో నారాయణ, పలమనేరు సీఐ మురళీమోహన్, గంగవరం సీఐ పరశురాములకు తెలియజేశారు. దీంతో పోలీసులు అప్పినపల్లి గ్రామస్తులను అప్రమత్తం చేయగా, గ్రామస్తులు అడ్డుకోవడంతో స్మగ్లర్లు శంకరరాయలపేట చెరువు కట్ట కింద వాహనాన్ని నిలిపేసి పరారయ్యారు. అనంతరం అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు ఎర్రచందనం దుంగలను కారుతో సహా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు

అక్రమంగా తరలుతున్న ఎర్రచందనాన్ని పట్టుకోవడంలో ధైర్యం చూపించిన అప్పినపల్లి గ్రామస్తులను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) తన ‘ఎక్స్’ ఖాతా వేదికగా అభినందించారు. గ్రామస్తుల చొరవ, ధైర్యాన్ని ప్రశంసించిన ఆయన, అటవీశాఖ అధికారులు, పోలీసులను కూడా అభినందించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Chittoor district Forest officials Google News in Telugu Latest News in Telugu Pawan Kalyan public intervention. Red Sandalwood Smuggling Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.