Rajasthan Crime: భర్తను చంపించిన భార్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు

Read Time:  1 min
Rajasthan Crime: భర్తను చంపించిన భార్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు
FONT SIZE
GET APP

Rajasthan Crime: రాజస్థాన్‌కు చెందిన ఆశిష్, అంజులకు మూడు నెలల క్రితమే వివాహం జరిగింది. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆశిష్‌ను, తన భార్యే కాలయముడిలా మారి అంతం చేస్తుందని ఎవరూ ఊహించలేదు. తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించిన అంజు, పెళ్లైన కొద్ది రోజులకే అతడిని వదిలించుకోవాలని క్రూరమైన పథకం రచించింది.

Read Also: Vijayawada GGH Doctor Death: డాక్టర్ దీపికా మృతి కేసులో.. వెలుగులోకి సంచలన విషయాలు

Rajasthan Crime: Key facts come to light in the case of a wife who killed her husband

రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ

పథకం ప్రకారం, ఒక రోజు రాత్రి దంపతులిద్దరూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, అంజు ప్రియుడు సంజూ తన కారుతో వెనుక నుండి వచ్చి ఆశిష్‌ను బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆశిష్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించాడు. ఇది కేవలం అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదమని నమ్మించేందుకు అంజు పోలీసులకు తప్పుడు వాగ్మూలం ఇచ్చింది. అయితే, ప్రమాదం జరిగిన తీరుపై పోలీసులకు మొదటి నుంచీ అనుమానం కలిగింది.

వెలుగులో కీలక విషయాలు

అంజలీకి సంజయ్‌తో ఏడేళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగుతున్న విషయం ఆమె కుటుంబానికి ముందే తెలిసినా, ఆశిష్‌తో వివాహం జరిగినట్లు దర్యాప్తులో తేలింది. అయితే వివాహానంతరం కూడా సంజయ్‌తో సంబంధం కొనసాగించిన అంజలీ, 16 రోజుల క్రితమే ఆశిష్ హత్యకు సంజయ్‌తో కలిసి ప్లాన్(Planned Murder) సిద్ధం చేసినట్లు పోలీసులు గుర్తించారు. హత్య అనంతరం ఘటనను దొంగతనంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. కేసులో మరిన్ని కీలక అంశాలు దర్యాప్తులో తేలనున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.