రాజస్థాన్(Rajasthan)లోని జైసల్మేర్‌లో ఓ బస్సులో ఆకస్మిక మంటలు ఏర్పడ్డాయి. ఈ ప్రమాద ఘటనలో 12 మంది సజీవదహనం కాగా.. ఇప్పుడు మృతులు సంఖ్య 20కు చేరింది. జోధ్‌పూర్ వెళ్లే హైవేపై మధ్యాహ్నం ఓ ప్రైవేట్ బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద ఘటనలో 20 మంది మృతి చెందడంతో పాటు మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరుగుతున్న సమయంలో ఆ బస్సులో దాదాపుగా 55 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే బస్సులో మంటలు వచ్చిన వెంటనే అందులో ఉన్నవారిని కాపాడటానికి ఆ డ్రైవర్ ప్రయత్నించాడు. కానీ అప్పటికే కొందరు ఆ మంటల్లో సజీవ దహనం అయ్యారు.
బస్సు నిర్వహణలో ఏవైనా లోపాలు ఉన్నాయా?
మరికొందరు తీవ్రంగా గాయపడటంతో వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే 10 నుంచి 15 మంది గాయపడినట్లు అనుకున్నారు. కానీ కొన్ని నిమిషాల వ్యవధిలోనే మరణాలు పెరిగాయి. అయితే ఈ మంటలు సడెన్‌గా బస్సులో ఎందుకు వచ్చాయనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. బస్సు నిర్వహణలో ఏవైనా లోపాలు ఉన్నాయా? లేకపోతే సాంకేతిక సమస్యలా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. పండుగ సమయంలో సాధారణంగా ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటారు.