📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Rajampet crime: భార్య ఉరివేసుకుంటుంటే వీడియో తీసిన కిరాతక భర్త!

Author Icon By Tejaswini Y
Updated: March 13, 2026 • 11:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Rajampet crime: Cruel husband who filmed wife hanging herself!

Rajampet crime: మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతోంది అనడానికి కడప జిల్లా రాజంపేటలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. ఒకవైపు భార్య ప్రాణాపాయ స్థితిలో ఉంటే, కాపాడాల్సిన భర్త రాక్షసంగా ప్రవర్తించాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంటే, ఆమెను ఆపాల్సింది పోయి “ఉరి ఎలా వేసుకోవాలో” సూచనలు ఇస్తూ సెల్‌ఫోన్‌లో వీడియో తీసిన ఉన్మాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

Read Also: Nellore Crime: లారీ ఢీకొని ఆటో మెకానిక్ మృతి

అసలేం జరిగిందంటే..

రాజంపేటలో రైల్వే లోకో పైలట్‌గా పనిచేస్తున్న శ్రీరామ్ శ్రీనివాస్, అతని భార్య కృష్ణవేణి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన కృష్ణవేణి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న శ్రీనివాస్, ఆమెను అడ్డుకోకపోగా అత్యంత క్రూరంగా వ్యవహరించాడు. “ఉరి అలా కాదు.. ఇలా వేసుకోవాలి” అంటూ ఆమెకు సూచనలు ఇస్తూ, ఆ దృశ్యాలను తన మొబైల్‌లో రికార్డ్ చేశాడు. దీంతో కృష్ణవేణి ఉరివేసుకుని మృతి చెందింది.

బందువుల ఆగ్రహం – పోలీసుల విచారణ

ఈ విషయం బయటకు రావడంతో కృష్ణవేణి బంధువులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. శ్రీనివాస్ ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతనిపై దాడికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నిందితుడు శ్రీరామ్ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ అమానుష ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, సదరు వీడియోను స్వాధీనం చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Andhra Pradesh crime news Kadapa news Krishnaveni Death Case Rajampet Shocking Incident Sriram Srinivas Railway Loco Pilot

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.