Rajahmundry Milk Adulteration Case: రాజమండ్రిలో ఇటీవల కలకలం రేపిన పాల కల్తీ వ్యవహారంలో అధికారులు కీలక పురోగతి సాధించారు. పాల నాణ్యత దెబ్బతినడానికి గల కారణాలను విశ్లేషించిన అధికారులు, ఇది ప్రమాదవశాత్తు జరిగిన సాంకేతిక లోపంగా గుర్తించారు.
Read also: Vijay-Pawan: పవన్ కళ్యాణ్ రూట్లోనే విజయ్? రెండు చోట్ల పోటీకి సిద్ధం!
కూలెంట్ లీకేజీయే ప్రధాన కారణం
డెయిరీ ఫ్రిడ్జ్‌లలో ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడానికి ఉపయోగించే ఇథిలీన్ గ్లైకాల్ (Ethylene Glycol) అనే రసాయన ద్రవం పాలలో కలిసినట్లు అధికారులు నిర్ధారించారు. వారం క్రితం కూలింగ్ ఛాంబర్లకు మరమ్మతులు చేస్తున్న సమయంలో, పైపుల నుండి ఈ కూలెంట్ లీకై నిల్వ ఉన్న పాలలో కలవడంతో ఈ ప్రమాదం సంభవించింది.
అనధికారిక నిర్వహణ గుర్తింపు
ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టగా, ‘గణేష్ కూలింగ్ ఛాంబర్’ అనే సంస్థ ‘వరలక్ష్మి డెయిరీ’ పేరుతో ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వెలుగుచూసింది. నిబంధనలకు విరుద్ధంగా నిల్వ కేంద్రాలను నిర్వహించడం మరియు మరమ్మతుల సమయంలో అప్రమత్తంగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: