ర్యాగింగ్ (Ragging) నిరోధానికి కోర్టులు ఎన్ని చట్టాలు చేసినా ప్రయోజనం ఉండడం లేదు. ప్రభుత్వాలు దీన్ని అరికట్టేందుకు ఎంతగా ప్రయత్నిస్తున్నా ఫలితం ఆశించినంతగా కనిపించడం లేదు. నిత్యం ఎక్కడో ఒకచోటు ఎదో ఒక ఇన్సిస్టిట్యూట్లలో ర్యాగింగ్ జరుగుతూనే ఉంది. విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. తాజాగా ఆర్జియుకె శ్రీకాకుళం(Srikakulam) కాలేజీలో ఇఇఇ థర్డ్ఇయర్ చదివే ప్రత్తిపాటి సృజన్ అనే విద్యార్థి ఓ అమ్మాయితో మాట్లాడుతున్నాడని దారుణంగా కొట్టారు ఫోర్త్ ఇయర్ సీనియర్స్.
నిన్న అర్థరాత్రి రూంలోకి తీసుకెళ్లి నాలుగు గంటలపాటు చిత్రహింసలు పెట్టారు. అంతటితో ఆగక ఎనిమిదిమంది సీనియర్లు దారుణంగా కొట్టారు. దీంతో మనస్తాపానికి గురై సృజన్ తన రూంలోకి వెళ్లి, ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బయటకు రావడంతో వెంటనే కాలేజీ యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు దిగింది.
Read Also: America: హెచ్1బీ వీసా పెంపు టాప్ కంపెనీల కన్ను భారత్‌పై
విద్యార్థులను సస్పెండ్ చేసిన యాజమాన్యం
విద్యార్థి(student) తల్లిదండ్రులు యాజమాన్యాన్ని నిలదీసింది. తమ కుమారుడి మృతికి కారణం సీనియర్లే అని ఆరోపించారు. దీంతో వాస్తవాలను తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం ఎనిమిదిమంది విద్యార్థులను సస్పెండ్ చేసింది. ప్రస్తుతం విద్యార్థులను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు.
మరణించిన విద్యార్థికి న్యాయం జరగాలని క్యాంపస్ లో తోటి విద్యార్థులు నిరసనకు దిగారు. ర్యాగింగ్ పై రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన నియమాలను ఏర్పాటుచేసింది. ర్యాగింగ్ కు పాల్పడేవారిపై ఎలాంటి ఉపేక్ష చూపరాదని, వారిని కఠినగా శిక్షించి, ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని కూడా ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: