📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Radhika Yadav: టెన్నిస్ క్రీడాకారిణి రాధిక హత్య..స్పందించిన స్నేహితురాలు హిమాన్షిక

Author Icon By Anusha
Updated: July 13, 2025 • 6:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ విషాదాంతం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. ఆమెను ఆమె స్వయాన తండ్రే కాల్చి చంపిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన కలిగించింది. ఇప్పుడు ఈ ఘటనపై ఆమె ప్రాణస్నేహితురాలు హిమాన్షిక సింగ్ స్పందించింది. రాధిక గతంలో తన కుటుంబ నియంత్రణల మధ్య ఎంతటి ఒత్తిడిలో జీవించిందో హిమాన్షిక (Himanshika Singh) పేర్కొంది.హిమాన్షిక సింగ్ ప్రకారం, రాధికతో 2012 నుంచే తమ స్నేహం కొనసాగుతోంది.ఆమె స్వేచ్ఛతో జీవించేది. ఆమె తరచూ షార్ట్స్ ధరించేదని, అబ్బాయిలతో మాట్లాడేదని, తన ఇష్టప్రకారం జీవించేదని గుర్తుచేసుకుంది. ఇవే ఆమెను టార్గెట్ చేశాయని, రాధిక కదలికలను ఇంట్లోవారు నియంత్రించారని పేర్కొంది. బయటకు వెళ్లాక పలానా సమయంలో తిరిగి ఇంటికి రావాలని ఆంక్షలు విధించేవారని గుర్తుచేసుకుంది.

నియంత్రణ విధిస్తూ

ఆమె తండ్రి ఆమెపై ప్రతి విషయంలోనూ నియంత్రణ విధించేవాడు. బయటకు వెళ్లినప్పుడు ఎప్పటికప్పుడు తిరిగి రావాలని డెడ్‌లైన్లు (Deadline) పెడుతూ ఉండేవాడు. టెన్నిస్ అకాడమీ ఇంటికి కేవలం 15 నిమిషాల దూరంలో ఉన్నా, ఆమెపై నిఘా కొనసాగించేవాడు.ఆమె నాతో వీడియో కాల్‌లో ఉన్నప్పుడు, ఆమె ఎవరితో మాట్లాడుతుందో ఆమె తల్లిదండ్రులకు చూపించాల్సి వచ్చింది.రాధికది సంప్రదాయ కుటుంబమని, దాదాపు ప్రతిదానితోనూ సమస్యలు ఉండేవని తెలిపింది. ప్రతి విషయంలోనూ నియంత్రణ విధిస్తూ రాధిక (Radhika Yadav) జీవితాన్ని ఆమె తండ్రి దుర్భరం చేశాడని హిమాన్షిక ఆవేదన వ్యక్తంచేసింది.అతను తన నియంత్రణ, ప్రవర్తన, నిరంతర విమర్శలతో కుమార్తె జీవితాన్ని సంవత్సరాలుగా దుర్భరంగా మార్చాడు.

Radhika Yadav: టెన్నిస్ క్రీడాకారిణి రాధిక హత్య..స్పందించిన స్నేహితురాలు హిమాన్షిక

ఎంతో మంచిదని

షార్ట్స్ ధరించినందుకు, అబ్బాయిలతో మాట్లాడినందుకు, తన సొంత నిబంధనల ప్రకారం జీవించినందుకు వారు ఆమెను అవమానించారు అని పేర్కొంది. హిమాన్షిక తన ప్రాణ స్నేహితురాలిని, ఆమె ఎంతో మంచిదని వివరించింది. వీడియోలు చిత్రీకరించడం, ఫోటోలు తీయడాన్ని రాధిక ఇష్టపడుతుందని కూడా ఆమె చెప్పింది. క్రమంగా  వీడియోలు చిత్రీకరించడం వంటి ఆమె అభిరుచులన్నీ కనుమరుగయ్యాయి. ఆమె ఇంట్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. కుటుంబంపై సామాజిక ఒత్తిడి (Social pressure) ఉంది. ప్రజలు ఏమనుకుంటారో అని తల్లిదండ్రులు ఎల్లప్పుడూ ఆందోళన చెందేవారు. వారు చాలా సనాతనవాదులు” అని వివరించింది. ఇంట్లోని ఆంక్షలతో ఆమె ఊపిరాడనట్టు ఉండేదని హిమాన్షిక సింగ్ పేర్కొంది

టెన్నిస్ నియమాలు?

టెన్నిస్ ఆట యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం, బంతిని నెట్‌ పైనుగా ప్రత్యర్థి కోర్టులోకి కొట్టడం, అది ప్రత్యర్థి తిరిగి సరైన రీతిలో కొట్టలేని విధంగా ఉండాలి. ఇది ఒక సాంప్రదాయమైన ఆటగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది.

భారత టెన్నిస్ రాణి ఎవరు?

భారత టెన్నిస్ ప్రపంచంలో సానియా మిర్జా పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. టెన్నిస్ క్రీడలో ఆమె ఘనతలు, నైపుణ్యం, గౌరవం ఆమెను ఇండియన్ టెన్నిస్ క్వీన్ గా నిలిపాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Sports : ఇటలీకి టీ20 వరల్డ్‌కప్‌కి ఎంట్రీ

Breaking News emotional statement family restrictions father murder case Himanshi Singh Radhika Yadav social pressure Telangana news Telugu News tennis player women freedom

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.