📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Prajwal Revanna: ప్రజ్వల్‌ రేవణ్ణకు జీవితఖైదు.. అత్యాచారం కేసులో బెంగళూరు తీర్పు

Author Icon By Vanipushpa
Updated: August 2, 2025 • 5:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అత్యాచారం కేసులో మాజీ ప్రధాని దేవగౌడ మనవడు, జేడీఎస్‌ మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ (prajwal revanna)కు బెంగళూరు(Benglore) ప్రత్యేక న్యాయస్థానం జీవితఖైదు విధించింది. ఇంట్లో పనిమనిషిపై అత్యాచారం కేసులో ప్రజ్వల్‌ను దోషిగా తేల్చారు. ఇంట్లో పనిమనిషిపై అత్యాచారం చేసి, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినట్టు ప్రజ్వల్‌పై అభియోగాలు నమోదయ్యాయి. జేడీఎస్‌ నేత ప్రజ్వల్‌ రేవణ్ణకు ధర్మాసనం జీవితఖైదుతోపాటు.. రూ.5లక్షలు జరిమానా విధించింది. దీంతోపాటు రూ.7లక్షలు బాధితురాలికి ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.
హసన్‌ (Hasan)లోని తన ఫాంహౌస్‌తో పాటు , నివాసంలో బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేసి , వీడియో తీసినట్టు ప్రజ్వల్‌ రేవణ్ణపై కేసు నమోదయ్యింది. గత ఏడాది మే 21న అత్యాచారం కేసులో ప్రజ్వల్‌ రేవణ్ణను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. ఆగస్ట్‌ 2024లో ప్రజ్వల్‌ రేవణ్ణపై చార్జ్‌షీట్‌ దాఖలయ్యింది.

Prajwal Revanna: ప్రజ్వల్‌ రేవణ్ణకు జీవితఖైదు.. అత్యాచారం కేసులో బెంగళూరు తీర్పు

ఫోరెన్సిక్‌ నివేదికలు లీకైన వీడియోలు
హాసన్‌లోని గన్నికాడ ఫామ్‌హౌజ్‌లో 2021 COVID లాక్‌డౌన్ సమయంలో ప్రజ్వల్‌ తనపై రెండు సార్లు అత్యాచారం చేసినట్లు బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ప్రజ్వల్‌ తల్లిదండ్రులు తనను కిడ్నాప్‌ చేసి బెదిరించారని కూడా ఆరోపించారు. ఈ కేసులో సిట్‌ దర్యాప్తు ముమ్మరంగా జరిగింది. ఫోరెన్సిక్‌ నివేదికలు లీకైన వీడియోలను ధృవీకరించాయి. కిందటి ఏడాది మే 31వ తేదీన జర్మనీ నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన ప్రజ్వల్‌ను ఎయిర్‌పోర్టులోనే పోలీసులు అరెస్ట్‌ చేశారు. గత 14 నెలలుగా జ్యుడీషియల్‌ కస్టడీలోనే ప్రజ్వల్‌ ఉన్నాడు.
మూడో అత్యంత పిన్నవయసున్న ఎంపీగా ఘనత
ప్రజ్వల్‌ రేవణ్ణ.. మాజీ ప్రధాని దేవగౌడ మనవడు. మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ తనయుడు. 2015లో జేడీఎస్‌లో చేరి.. 2019 ఎన్నికల్లో హసన్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. ఆ దఫా పార్లమెంట్‌లో.. మూడో అత్యంత పిన్నవయసున్న ఎంపీగా ఘనత సాధించాడు. అయితే 2023లో అఫిడవిట్‌లో లోపాల కారణంగా కర్నాటక హైకోర్టు ఆయన ఎంపీ పదవిపై అనర్హత వేటు వేస్తూ తీర్పు ఇచ్చింది. తనకు తక్కువ శిక్ష విధించాలని న్యాయమూర్తిని మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అభ్యర్థించారు. న్యాయమూర్తిని వేడుకుంటున్న సమయంలో బోరున విలపించాడు. నిన్న ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించిన వెంటనే కూడా మాజీ ఎంపీ కన్నీరుమున్నీరయ్యాడు. ఇంట్లో పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ప్రజ్వల్ రేవణ్ణను న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది .

ప్రజ్వల్ రేవణ్ణ దోషి అని సిట్ ఎలా నిరూపించింది? కేసు వివరాలు
మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఉన్న నాలుగు కేసుల్లో మొదటి కేసులో అత్యాచారం కేసులో దోషిగా తేలింది. అత్యాచారం వీడియో రికార్డ్ చేసినందుకు కూడా కోర్టు అతన్ని దోషిగా తేల్చింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/road-accident-school-bus-hits-lab-technician-miyapur/hyderabad/524503/

#telugu News Bengaluru Court Verdict crime against women Former MP Indian Politics Latest News Breaking News life imprisonment Prajwal Revanna Rape case sexual assault

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.