శ్రీ సత్యసాయి జిల్లా : హిందూపురం రూరల్ పరిధిలోని తూముకుంట గ్రామంలో ఓ 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన కేసులో ఒకరికి యావజ్జీవ కారాగార శిక్ష రూ.10000ల జరిమానా, బాలిక శవాన్ని పూడ్చి సాక్ష్యాన్ని తారుమారు చేసేందుకు ప్రయత్నించినందుకు మరో 5 సంవత్సరాలు జైలు (5 years in prison) శిక్ష రూ.10,000ల జరిమానా విధిస్తూ అనంతపురం ఫోక్సో కేసుల స్పెషల్ కోర్టు జడ్జి చినబాబు తీర్పు వెలువరించినట్లు జిల్లా ఎస్పీ వి.రత్న తెలియజేశారు. ఎస్పీ అందించిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి, శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ పరిధిలోని అప్ గ్రేడ్ పోలీసు స్టేషన్లో క్రైమ్ నంబర్: 172/2024 అండర్ సెక్షన్ 103, 238,65 (2) 66 బిఎన్ఎస్ యాక్ట్ క్రింద, సెక్షన్ 5 ఆర్/డబ్ల్యూ 6 యాక్ట్ ఆఫ్ హిందూపురం రూరల్ పిఎస్ వైట్ సెక్షన్ నెంబర్ 92/2024 గల ఈకేసులో చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు అప్ గ్రేడ్ సిఐ శ్రీనివాసులు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అప్పటి డిఎస్పి ఇన్వెస్టిగేషన్ అధికారి అయిన, కన్జక్షన్, ప్రస్తుత డి.ఎస్.పి కెవి మహేష్, సిఐ ఆంజనేయులు దర్యాప్తు చేపట్టి ఈ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేశారన్నారు. 17 మంది సాక్షులను ప్రవేశపెట్టిగా, అన్ని కోణాల్లో ఈ కేసును సమగ్రంగా విచారించిన అనంతపురం పోక్సో కోర్టు జడ్జి, చినబాబు, నిందితుడి గంగాధర్ కి సోమవారం యావజ్జీవ కారాగార శిక్ష, 10,000 జరిమానాతో పాటు సాక్ష్యాన్నితారుమారు చేసే ప్రయత్నం చేసినందుకు ఐదు సంవత్సరాలు జైలు శిక్ష 10,000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారన్నారు.
పక్కాగా దరాప్తు చేసిన డీఎస్పీలు కంజక్షన్, కెవి మహేష్, సి ఐ శ్రీనివాసులు, అప్ గ్రేడ్ సిఐ ఆంజనేయులు, ప్రాసిక్యూషన్ (Prosecution) తరుపున వాదించిన స్పెషల్ ఎపిపి ఈశ్వరమ్మ, సుజన, లక్ష్మీ నారాయణ, కోర్టు కానిస్టేబుల్ మల్లికార్జున, కానిస్టేబుల్ పవన్ కుమార్, కోర్టు లిఐసన్ ఆఫీసర్ ఏఎస్ఐ శ్రీనివాసులను జిల్లా ఎస్పీ అభినందించారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ సంఘటన చోటుచేసుకున్న కొద్ది రోజులలోనే జిల్లా ఎస్పీ కేసును సీరియస్గా తీసుకోవడంతో పాటు, కొత్త బి.ఎన్.ఎస్ చట్టాల ప్రకారం, నేరస్తుడికి శిక్షపడేందుకు ఎంతో చొరవ తీసుకున్నారు. దీంతో నేరస్తుడికి సోమవారం యావజ్జీవకారాగార శిక్ష తీర్పు వెలువరించడంతో, రాష్ట్ర ఉన్నతస్థాయి పోలీస్ అధికారులు జిల్లా ఎస్పీని ప్రశంసించారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :