📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: Hans Raj: బీజేపీ ఎమ్మెల్యే హన్స్ రాజ్‌పై పోక్సో కేసు నమోదు

Author Icon By Anusha
Updated: November 9, 2025 • 11:03 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) లో, చురా నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ డిప్యూటీ స్పీకర్ హన్స్‌రాజ్‌ పై పోలీసులు పాక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. మైనర్‌గా ఉన్నప్పుడు తనపై లైంగిక దాడి జరిగిందని, పెళ్లి పేరుతో మోసం చేశారని ఓ యువతి చేసిన ఫిర్యాదుతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

Read Also: UP:షమ్లీలో ఘోర రోడ్డు ప్రమాదం – పెళ్లి ముందురోజే విషాదం

ఈ కేసు నమోదు కావడానికి ఒక రోజు ముందే, ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడితో పాటు మరో సన్నిహితుడిపై కిడ్నాపింగ్ కేసు నమోదవడం గమనార్హం.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న అనంతరం శుక్రవారం ఎమ్మెల్యే హన్స్‌రాజ్‌పై కేసు నమోదు చేశారు.

చిన్నారులపై లైంగిక నేరాల నిరోధక (పోక్సో) చట్టంలోని సెక్షన్ 6 (తీవ్రమైన లైంగిక దాడి), భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 69 (పెళ్లి పేరుతో మోసగించి లైంగిక దాడి) కింద ఈ కేసు ఫైల్ చేసినట్లు చంబా అదనపు ఎస్పీ హితేష్ లఖన్‌పాల్ శనివారం ధ్రువీకరించారు.

హన్స్ రాజ్ తీవ్రంగా ఖండించారు

బాధితురాలు మైనారిటీ వర్గానికి చెందిన యువతి అని, ఘటన జరిగిన సమయంలో తాను మైనర్‌నని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.అయితే, తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే హన్స్ రాజ్ (Hans Raj) తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ రాజకీయ ప్రేరేపిత ఆరోపణలని, తన ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు ప్రత్యర్థులు పన్నిన కుట్ర అని ఆయన కొట్టిపారేశారు.

Hans Raj

గతంలో ఎమ్మెల్యే (Hans Raj) తనకు అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నారని, నగ్న ఫోటోలు పంపమని వేధిస్తున్నారని ఇదే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, దర్యాప్తు అనంతరం పోలీసులు ఆ కేసులో క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేశారు. కానీ ఈ నెల 2న సదరు యువతి సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది.

ఎమ్మెల్యే అనుచరులు ఒత్తిడి చేస్తున్నారని

ఎమ్మెల్యే తన కుటుంబాన్ని బెదిరిస్తున్నారని, తన తండ్రిని అధికారులు వేధిస్తున్నారని, ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే అనుచరులు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించింది.ఈ క్రమంలో, బాధితురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించారు. గతేడాది ఎమ్మెల్యే హన్స్‌రాజ్, ఆయన అనుచరులు తనను, తన కుమార్తెను బలవంతంగా సిమ్లాకు తీసుకెళ్లి, మొబైల్ ఫోన్లు లాక్కుని, బెదిరించి ఒక స్క్రిప్టెడ్ వీడియో రికార్డ్ చేయించారని ఫిర్యాదు చేశారు.

దీంతో గురువారం ఎమ్మెల్యే సహాయకులు ఇద్దరిపై కిడ్నాపింగ్, బెదిరింపుల కింద కేసు నమోదైంది. ఆ తర్వాత బాధితురాలి వాంగ్మూలంతో నేరుగా ఎమ్మెల్యేపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చంబా ఎస్పీని ఆదేశించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

BJP MLA Hansraj Himachal pradesh latest news POCSO case sexual assault Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.