తెలంగాణలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) నేపథ్యంలో, (PCC) చీఫ్ మహేశ్‌గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో మాజీ సీఎం KCR కు నోటీసులు ఇవ్వడంలో ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని ఆయన ధృవీకరించారు.ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ అంటే గౌరవం ఉందన్నారు. ఈ కేసులో విచారణ పారదర్శకంగా జరుగుతోందని, SIT ఎవరికైనా నోటీసులు ఇవ్వొచ్చన్నారు. గత CM, మంత్రుల ప్రమేయం లేకుండా అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేసే ఛాన్స్ లేదని చెప్పారు. పూర్తి విచారణ జరిగితే నిజాలు బయటపడతాయని, కేసులో భాగస్వాములు ఎవరో తేలాల్సి ఉందన్నారు.
Read Also: Phone Tapping Case: KCRకు సిట్ నోటీసులు.. స్పందించిన కవిత
రాజకీయ నేతల ఫోన్ లు నిఘా?
ఈ కేసు (Phone Tapping Case) లో ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ అగ్రనేతలను సిట్ విచారించింది. మాజీ మంత్రి హరీష్ రావు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్ రావులను ఇప్పటికే సిట్ అధికారులు ప్రశ్నించారు. వీరి నుంచి సేకరించిన వివరాలు, అలాగే ప్రస్తుతం జైలులో ఉన్న పోలీసు అధికారుల వాంగ్మూలాల ఆధారంగా కేసీఆర్‌ను విచారించాల్సిన అవసరం ఉందని సిట్ భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిఘా పరికరాల వినియోగం, రాజకీయ నేతల ఫోన్ల నిఘాపై ప్రధానంగా ఈ విచారణ సాగనున్నట్లు తెలిసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: