📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Payakaraopeta Crime: బాలికపై లైంగిక దాడి.. వీడియోలతో బ్లాక్‌మెయిల్

Author Icon By Anusha
Updated: March 13, 2026 • 10:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Payakaraopeta Crime: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలో ఒక దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. సాయిచంద్ అనే యువకుడు ఒక మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా, ఆ దారుణాన్ని తన ఫోన్‌లో వీడియో చిత్రీకరించాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే, సదరు వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బాలికను భయభ్రాంతులకు గురిచేస్తూ నిరంతరం బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు.

Read Also: Nellore Crime: లారీ ఢీకొని ఆటో మెకానిక్ మృతి

సీఐ జి.అప్పన్న కథనం ప్రకారం.. బాధితులు ఇచ్చన ఫిర్యాదు వివరాల మేరకు.. అనకాపల్లి జిల్లాకు చెందిన బాలికను తల్లిదండ్రులు విశాఖలో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్లో చేర్పించారు. హాస్టల్లో ఉంటున్న ఈ బాలికకు తన స్నేహితురాలి ద్వారా చినగదిలి (విశాఖ)కి చెందిన దల్లి సాయిచంద్ (20) పరిచయమయ్యాడు. ఇతడు బాలికను ప్రేమించాలని వెంబడిస్తూ వేధింపులకు గురిచేసేవాడు. తన ప్రేమను అంగీకరించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.

Payakaraopeta Crime: Sexual assault on girl.. Blackmail with videos

గతేడాది ఏప్రిల్లో బాలికను పాయకరావుపేటకు సమీపంలో ఓ లాడ్జికి తీసుకువెళ్లి అసభ్యంగా వీడియోలు చిత్రీకరించాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి బాలికను విశాఖలో పెందుర్తి ప్రాంతంలో తన నివాసానికి తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఈ ఏడాది జనవరి చివరి వారంలో బాధితురాలిని నిందితుడు తన ఇంటికి తీసుకువెళ్లాడు. జరిగిన విషయాన్ని పోలీసులకు చెబితే వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని ఆమె తల్లిదండ్రులను ఫోన్లో బెదిరించాడు. బాధితురాలు మైనర్ అని తెలిసినప్పటికీ ఆమెను నెల పాటు పెందుర్తిలో తన ఇంట్లోనే నిందితుడి తల్లి నిర్బంధించింది.

పోలీసులకు ఫిర్యాదు

బాధితురాలు ఈ వేధింపులను భరించలేక ఈ నెల 8న నిందితుడి ఇంటి నుంచి తప్పించుకుని తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి జరిగిన విషయాన్ని తెలిపింది. దీంతో వారు పాయకరావుపేట పోలీసులను ఆశ్రయించారు. నిందితుడు తీసిన వీడియోలను బాధితురాలి తల్లిదండ్రులకు పంపడంతోపాటు ఇన్ స్టాగ్రామ్ ద్వారా వారి బంధువులకు కూడా పంపినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడు మరో ఇద్దరు అమ్మాయిలతో కూడా ఇలాగే వీడియోలు తీసినట్లు విచారణలో వెల్లడైంది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు దల్లిసాయిచంద్, అతడి తల్లిని అరెస్టు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AP Crime Updates Minor Girl Assault Case Payakaraopeta Crime POCSO case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.