📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Nagpur: రెండు నెలలుగా బాలుడిని గొలుసుతో కట్టేసిన తల్లిదండ్రులు..కేసు నమోదు

Author Icon By Vanipushpa
Updated: January 3, 2026 • 1:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పన్నెండేళ్ల బాలుడి పట్ల తల్లిదండ్రులు అమానుషంగా ప్రవర్తించిన ఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ (Nagpur)లో చోటుచేసుకుంది. ఇంట్లో నుంచి పారిపోతున్నాడని, సెల్ ఫోన్లు దొంగిలిస్తున్నాడనే ఆరోపణలతో తల్లిదండ్రులే ఆ బాలుడిని ఇనుప గొలుసులతో కట్టేశారు. కూలి పనులు చేసి పొట్టపోసుకునే ఆ తల్లిదండ్రులు.. ఉదయాన్నే పనికి వెళుతూ కొడుకును ఇంటి బయట గొలుసులతో బంధించి, తాళాలు వేస్తుంటారు. సాయంత్రం తిరిగి వచ్చాకే గొలుసులు తీస్తారు. దాదాపు రెండు నెలలుగా కొనసాగుతున్న ఈ దారుణం తాజాగా స్థానికుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

Read Also: Gannavaram Airport: పొగమంచు కారణంగా దారి మళ్లిన విమానాలు

Nagpur: రెండు నెలలుగా బాలుడిని గొలుసుతో కట్టేసిన తల్లిదండ్రులు..కేసు నమోదు

మందలించినా వినడం లేదని..

సౌత్ నాగ్ పూర్ లోని ఓ పన్నెండేళ్ల బాలుడు స్కూలుకు వెళ్లకుండా ఆవారాగా తిరుగుతున్నాడు. ఇంట్లో నుంచి తరచూ చెప్పాపెట్టకుండా వెళ్లిపోయేవాడు. ఈ క్రమంలోనే కొడుకు ప్రవర్తనతో విసిగిపోయిన తల్లిదండ్రులు.. రోజూ బాలుడిని ఇంటిముందు ఇనుప గొలుసులతో బంధించి పనికివెళ్లేవారు. సాయంత్రం తిరిగి వచ్చాక గొలుసులు ఊడదీసేవారు. బాలుడి పరిస్థితిని గమనించిన చుట్టుపక్కల వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా మహిళా శిశు అభివృద్ధి శాఖ అధికారులు అక్కడికి చేరుకుని బాలుడిని విడిపించారు. భయాందోళనలతో ఉన్న బాలుడిని షెల్టర్ హోమ్ కు తరలించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. బాలుడి పట్ల అమానుషంగా ప్రవర్తించిన తల్లిదండ్రులపై జువైనల్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

chained child child abuse case Child Protection child rights India crime news Law and order parents arrested police case registered Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.