📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Panajagutta: హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. కాలేజీ విద్యార్థులు అరెస్ట్

Author Icon By Pooja
Updated: January 25, 2026 • 2:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణలో డ్రగ్స్ నెట్‌వర్క్‌ను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, మత్తు పదార్థాల కేసులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్ని అరెస్టులు, ఎంత నిఘా ఉన్నా ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు ఈ కేసుల్లో చిక్కుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈగల్ టీమ్ చేపడుతున్న ప్రత్యేక ఆపరేషన్లలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి.

Read Also:AP: భూ వివాదాలతో అన్నను కొడవలితో హత్య చేసిన తమ్ముడు

హైదరాబాద్ నడిబొడ్డులో డ్రగ్స్ కలకలం
తాజాగా హైదరాబాద్ పంజాగుట్ట(Panajagutta) ప్రాంతంలో డ్రగ్స్ కలకలం రేగింది. నాగార్జున సర్కిల్ సమీపంలో పోలీసులు ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఒకే కాలేజీలో చదువుతున్న విద్యార్థులే కావడం గమనార్హం. డ్రగ్స్ వినియోగిస్తున్న సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన వారివద్ద నుంచి సుమారు 10 గ్రాముల MDMAని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

సరఫరా నెట్‌వర్క్‌పై విచారణ
ఈ కేసుకు సంబంధించి డ్రగ్స్(Panajagutta) ఎవరు సరఫరా చేస్తున్నారన్న దానిపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారన్న అంశాన్ని కూడా తేల్చే ప్రయత్నం చేస్తున్నారు. డ్రగ్ కల్చర్‌పై తెలంగాణ పోలీస్ శాఖ తీవ్రంగా స్పందిస్తోంది. నిందితులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. యువతను మత్తుకు బానిసలుగా మారుస్తున్న ముఠాలపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

DrugFreeTelangana Google News in Telugu HyderabadCrime Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.