బైబర్పంక్తువాలో పాక్ దళాలు ఉగ్రవాద దళాలతో వరుసగా దాడులు జరుపుతూనే ఉన్నాయి. దక్షిణ వజీరిస్తాన్ సరిహద్దులోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని దర్బన్ ప్రాంతంలో దాడులు చేసింది. నిఘావర్గాల సమాచారం ప్రకారం నిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబన్
పాకిస్తాన్ (టిటిపి)కి చెందిన 13 మంది ఉగ్రవాదులను పాకిస్తాన్ Pakistan భద్రతాదళాలు హతమార్చాయి. దర్బన్ ప్రాంతంలో ఫిట్నా అల్-ఖవారిజ్ ఉనికి గురించి సమాచారం అందిన తర్వాతనే ఈ ఆపరేషన్ ప్లాన్ చేసినట్లు పాకిస్తాన్ మిలిటరీ ఆర్మీ మీడియాకు తెలిపింది. ఈ ఎన్ కౌంటర్ లో 13మంది ఉగ్రవాదులను చంపిన తర్వాత మిలటరీ పెద్దమొత్తంలో ఆయుధాలను మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకుంది.
Pakistan
ఆత్మహుతి దాడులు పాకిస్తాన్ తెలిపిన విధంగా మరణించిన ఉగ్రవాదులు డిసెంబరు 2023 దర్బన్ ఆత్మాహుతి దాడి, ప్రభుత్వ అధికారులను కిడ్నాప్ చేసి చంపడం, పౌరులను లక్ష్యంగా చేసుకోవడం వంటి అనేక ఉగ్రవాద సంఘటనలలో పాల్గొన్నారని తెలుస్తోంది. Pakistan ప్రస్తుతం పాక్ దళాలు అక్కడ దాక్కున్న ఇతర ఉగ్రవాదులను నిర్మూలించడానికి శానిటైజేషన్ ఆపరేషన్ Sanitization operation నిర్వహిస్తున్నాయి. 30మంది అమాయకులను హతమార్చిన పాక్అంతకుముందు ఖైబర్ ఫంఖువాలో తిరి లోయలోని పాక్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దాడులను చేసింది. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలు 30మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. మాత్రుదారా అనే గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఈ దాడులు జరిగాయి. తెహ్రికీ తాలిబన్పాకిస్తాన్ Tehreek-e-Taliban Pakistan ముష్కరులే లక్ష్యంగా పాక్ సైన్యం ఈ దాడులకు పాల్పడినట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఈ దాడులు ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు ప్రారంభమయ్యాయి. పాక్ సైన్యం జెఎఫ్ 14 థండర్ జెట్లను ప్రయోగించాయి. జనావాసాలు ఉన్న ప్రాంతంలోనే ఎనిమిది బాంబు దాడులు జరగడంతో ప్రాణనష్టం సంభవించింది. ఈ పేలుడులో మహిళలు, పిల్లలు సహా 12మంది గాయపడ్డారు.
దర్బన్ ప్రాంతంలో పాక్ భద్రతాదళాలు ఎంతమంది ఉగ్రవాదులను హతమార్చాయి?
13 మంది ఉగ్రవాదులను హతమార్చాయి.
ఈ ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందేవారు?
తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP).
Read hindi news: hindi.vaartha.com
Read Also: