📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: ED: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన నటి ఊర్వశి రౌతేలా

Author Icon By Anusha
Updated: September 30, 2025 • 8:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (ED) తాజాగా తన దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. మనీలాండరింగ్ కేసులకు సంబంధించి ఇప్పటికే పలువురిని విచారించిన ఈడీ, తాజాగా బాలీవుడ్ నటి, మోడల్ ఊర్వశి రౌతేలా పేరును కూడా తన విచారణలో చేర్చింది.

Spirit Movie: స్పిరిట్ మూవీలో మడోన్నా సెబాస్టియన్?

నేడు ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) విచారణకు హాజరయ్యారు. ఆమెకు సంబంధించిన కొన్ని లావాదేవీలపై అధికారులు ప్రశ్నలు అడుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా 1xBet అనే ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కు సంబంధించి జరుగుతున్న మనీలాండరింగ్ కేసులో ఆమె పేరు బయటకొచ్చింది.

దీంతోనే ఈడీ ఆమెను ప్రత్యక్షంగా పిలిపించి వివరణలు కోరింది.ఈ నెలాఖరున విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు ఊర్వశికి గతంలోనే సమన్లు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె మంగళవారం ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. ఈ కేసులో సెలబ్రిటీల (Celebrities) ప్రమేయంపై ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది.

ED

శిఖర్ ధావన్, సురేశ్ రైనాలను కూడా ఈడీ అధికారులు విచారించారు

ఊర్వశికి ముందు, ఇదే కేసుకు సంబంధించి భారత మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేశ్ రైనాలను కూడా ఈడీ అధికారులు విచారించారు. 1xBet యాప్ ప్రచార ఒప్పందాలకు సంబంధించి వారి నుంచి వివరాలు సేకరించినట్లు తెలిసింది.సైప్రస్ కేంద్రంగా పనిచేసే 1xBet సంస్థ, ప్రపంచంలోని అతిపెద్ద ఆన్‌లైన్ క్యాసినోలలో ఒకటిగా పేరుపొందింది.

అనేక దేశాల్లో ఆర్థికపరమైన అవకతవకల ఆరోపణలు ఎదుర్కొని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో తమ సేవలను నిలిపివేసింది.గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహాదేవ్ సత్తా యాప్ కుంభకోణం తరహాలోనే ఈ కేసు కూడా కొనసాగుతోంది.

ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ కార్యకలాపాలను నియంత్రించేందుకు

ఆ కేసులో రణ్‌బీర్ కపూర్, శ్రద్ధా కపూర్ వంటి పలువురు సినీ తారలను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ కార్యకలాపాలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పార్లమెంటులో ఒక కొత్త బిల్లును ఆమోదించింది. డబ్బుతో కూడిన అన్ని ఆన్‌లైన్ గేమ్‌లను నిషేధించడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని రూపొందించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News ed investigation 1xbet case latest news online betting apps case Telugu News urvashi rautela ed questioning urvashi rautela money laundering urvashi rautela news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.