📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య

Latest News: Odisha Crime – ఇదేం ఉన్మాదం రా.. విద్యార్థుల కళ్లలో ఫెవిక్విక్ వేసిన తోటి విద్యార్థి

Author Icon By Anusha
Updated: September 15, 2025 • 11:53 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పిల్లలు చిన్న వయసులో ఉండగా పలు సరదా పనులు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అవి హానికరం కాకుండా ఆటపాటలుగా మారిపోతాయి. కానీ కొన్ని సందర్భాల్లో నిర్లక్ష్యం లేదా అజాగ్రత్త ప్రాణాపాయ స్థితులకు దారి తీస్తుంది. ఇలాంటి దురదృష్టకర సంఘటన ఒడిశాలోని కంధమాల్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

సలగూడ సేవాశ్రమం హాస్టల్‌లో నివసిస్తున్న 3వ, 4వ తరగతుల చిన్నారులు గురువారం రాత్రి తమ గదుల్లో నిద్రపోతున్నారు. అదే హాస్టల్‌ (Hostel) లోని మరో బాలుడు తెలియని ఉద్దేశ్యంతో లేదా సరదాగా ఆటపట్టించాలన్న ఉద్దేశంతోనో తన తోటి విద్యార్థుల కళ్లలో ఫెవిక్విక్ గమ్ పోశాడు. ఈ ఘటన రాత్రిపూట జరిగినందున ఎవరూ గమనించలేదు.

పిల్లలను లేపి కళ్లను తెరవడానికి ప్రయత్నించారు

మరుసటి రోజు ఉదయం చిన్నారులు నిద్రలేవగానే కళ్లను తెరవలేకపోయారు. మొదట వారు భయంతో అల్లాడిపోయారు. కళ్లలో మంట, గట్టిదనం అనిపించడంతో అరిచారు. వెంటనే ఈ విషయం తెలిసిన హాస్టల్ సిబ్బంది (Hostel staff) పిల్లలను లేపి కళ్లను తెరవడానికి ప్రయత్నించారు. కానీ ప్రయత్నాలు ఫలించకపోవడంతో పరిస్థితి సీరియస్‌గా ఉందని గుర్తించి వారిని సమీపంలోని గోఛపడ ఆసుపత్రికి తరలించారు.

వైద్యులు పరీక్షించగా ఎనిమిది మంది పిల్లల కళ్లలో ఫెవిక్విక్‌ గమ్‌ ఉన్నట్లు గుర్తించారు. దాంతో వెంటనే చికిత్స ప్రారంభించారు. కానీ మిగిలిన ఏడుగురు విద్యార్థుల పరిస్థితిలో ఎలాంటి మెరుగుదల కనిపించకపోవడంతో.. వారిని మెరుగైన చికిత్స కోసం పుల్‌బనీలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన గ్రామంలో, పాఠశాల విద్యార్థుల (School students) తల్లిదండ్రులలో తీవ్ర ఆందోళనను, ఆగ్రహాన్ని కలిగించింది. ఈ ఘటన వెనుక హాస్టల్ యాజమాన్యం, ముఖ్యంగా ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం ఉందని గ్రామ సర్పంచ్ రోహిత్ కన్హర్ తీవ్ర ఆరోపణలు చేశారు.

Odisha Crime

ఇతర ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడం వల్లే ఇలాంటి దారుణం

ఈ సమాచారం అందిన వెంటనే తాను స్వయంగా హాస్టల్‌కు వెళ్లి పరిస్థితిని సమీక్షించినట్లు తెలిపారు. “హాస్టల్‌లో ప్రిన్సిపాల్‌తో పాటు ఇతర ఉపాధ్యాయులు కూడా అందుబాటులో లేకపోవడం వల్లే ఇలాంటి దారుణం జరిగింది. వారు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు” అని కన్హర్ అన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు వెంటనే ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తు అనంతరం సలగూడ సేవశ్రమం ప్రిన్సిపాల్ తన విధులను నిర్వర్తించడంలో నిర్లక్ష్యం వహించారని నిర్ధారించారు. జిల్లా కలెక్టర్ (District Collector) ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆ ప్రిన్సిపాల్‌ను వెంటనే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటన తల్లిదండ్రులకు తమ పిల్లల భద్రత పట్ల భయాందోళనలను పెంచింది. పాఠశాలలు, హాస్టల్లలో విద్యార్థుల భద్రతకు సంబంధించి మరిన్ని కఠినమైన నియమాలు, నిబంధనలు తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/betting-case-ed-issues-notices-to-urvashi-mimi-chakraborty-in-online-betting-app-promotion-case/crime/547245/

Breaking News child safety in hostels Fevikwik in children eyes hostel negligence Kandhamal district news latest news Odisha hostel incident Salaguda Seva Ashram Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.