📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Odisha: ఒడిశాలో దారుణం.. బాలికను సజీవదహనం చేసేందుకు యత్నించిన దుండగులు

Author Icon By Anusha
Updated: July 20, 2025 • 12:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒడిశాలో మహిళలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలు ఒక్కటింటి తర్వాత ఒక్కటి వెలుగులోకి రావడం తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. బాలాసోర్‌ (Balasore) లో ఓ బీఈడీ విద్యార్థిని ప్రొఫెసర్ వేధింపులకు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరవకముందే, పూరీ జిల్లాలో మరొక దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15 ఏళ్ల బాలికను ముగ్గురు దుండగులు సజీవదహనం చేయాలని యత్నించడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.పూరీ జిల్లా బయాబర్ గ్రామానికి చెందిన ఓ ఇంటర్ చదువుతున్న బాలిక, తన స్నేహితురాలి ఇంటికి పుస్తకాలు ఇవ్వడానికి వెళ్లిన సమయంలో ఈ దారుణ ఘటన జరిగింది.

మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు

ఆమె బయలుదేరిన కొద్దిసేపటికే, భార్గవి నది సమీపంలో ఉన్న ఓ నిర్జన ప్రదేశంలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు బాలికను అడ్డగించారు. బాలికపై వారు పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలు అంటుకున్న బాలిక కేకలు వేస్తూ అరిచింది. ఆమె అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన బాలికను తొలుత పిపిలీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్ ఎయిమ్స్‌ (Bhubaneswar AIIMS) కు తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

తక్షణమే అరెస్ట్

నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.ఘటనపై స్పందించిన ఒడిశా ఉపముఖ్యమంత్రి ప్రవతి పరిదా (Pravati Parida), బాలిక ఆరోగ్యంపై తన ఆవేదనను వ్యక్తం చేశారు. బాధిత బాలికకు చికిత్స నిమిత్తం అవసరమైన అన్ని ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించినట్టు తెలిపారు.ఈ దారుణమైన సంఘటనపై మహిళలపై రోజురోజుకీ పెరుగుతున్న అత్యాచారాలు, హింసాకాండలు భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఈ ఘటనను తక్షణమే విచారించి నిందితులను శిక్షించకపోతే, ఇలాంటి దుర్మార్గాలకు అడ్డుకట్ట పడదని సామాజిక కార్యకర్తలు పేర్కొంటున్నారు.

ఒడిశా దేనికి ప్రసిద్ధి చెందింది?

ఒడిశా అనేది పురాతన దేవాలయాలు, సంపన్న సంస్కృతి మరియు సాంప్రదాయాలతో ప్రసిద్ధి చెందిన రాష్ట్రం. ముఖ్యంగా పూరీలోని జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయం (ఇది UNESCO వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది) ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి.

ఒడిశాలో అత్యంత ధనిక జిల్లాగా ఏది పరిగణించబడుతుంది?

ఖుర్దా జిల్లా ఒడిశాలోని అతి ధనిక,అభివృద్ధి చెందిన జిల్లాగా పరిగణించబడుతుంది. ఈ జిల్లాలోనే రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ ఉంది. ఇది ఒడిశా యొక్క విద్యా, ఆర్థిక,ఐటీ కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Latest Crime News: కూతురిని వేధించాడని యువకుడిని హత్య చేసిన తండ్రి..ఎక్కడంటే?

bhubaneswar aiims Breaking News girl attacked girl burnt alive attempt girl victim latest news minor girl crime odisha breaking news odisha crime odisha latest news Odisha news odisha shame odisha violence puri horror puri incident student girl attack Telugu News women safety india

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.