నిజామాబాద్ జిల్లా(Nizambad Crime) నవీపేట మండలం ఫకీరాబాద్ మిట్టాపూర్ శివారులో జరిగిన ఘోర ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. బాసర ప్రధాన రహదారి పక్కన గుర్తు తెలియని మహిళ మృతదేహం(Nizambad Crime) మొండెం మాత్రమే మిగిలి ఉండటంతో తీవ్ర కలకలం రేగింది. దుండగులు ఆ మహిళను అమానుషంగా హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఆమె తలను మొండెం నుంచి వేరు చేయడమే కాకుండా, ఒక చేయి, మరో చేతి వేళ్లను కూడా నరికి వేశారు. శవం నగ్న స్థితిలో ఉండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
Read Also: Air Pollution: భారత్‌లో పెరుగుతున్న వాయు కాలుష్యం – ఏడాదిలో 17 లక్షల మరణాలు
మొండెం నుంచి తలను వేరు చేసిన నరరూప రాక్షసులు
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని, క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్(Dog Squad) సాయంతో ఆధారాల సేకరణ ప్రారంభించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించి, విచారణను వేగవంతం చేయాలని సూచించారు. మృతురాలిని గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక నెలరోజుల వ్యవధిలో ఇదే ప్రాంతంలో మరో ఇద్దరు మహిళలు హత్యకు గురికావడంతో ప్రజల్లో భయం నెలకొంది. వరుస ఘటనలు జరుగుతుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, నిందితులను వెంటనే పట్టుకుని కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: