📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Nizamabad: మద్యానికి బానిసైన తల్లి.. ఐదు నెలల పసికందును హతమార్చిన వైనం

Author Icon By Anusha
Updated: July 9, 2025 • 2:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ మండలం గోనుగొప్పుల గ్రామంలో మానవత్వాన్ని కలిచివేసే దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన కన్న తల్లి ముక్కు పచ్చలారని కన్నా కూతురినే కడతెరిచింది. అభం శుభం తెలియని బోసి నవ్వుల చిన్నారిని దుప్పటి కప్పి గొంతు నులిమి చప్పేసింది. పూర్తి వివరాలు,భీంగల్ మండలం గోనుగొప్పుల గ్రామానికి చెందిన గంగోని మల్లేష్, రమ్య (Ramya) లకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరి దాంపత్యానికి చిహ్నంగా ఐదు నెలల పండంటి ఆడ బిడ్డ జన్మించింది. ఆ చిన్నారికి ముద్దుగా శివాని అని పేరు కూడా పెట్టారు ఆ దంపతులు. మల్లేష్ ఓ రైస్ మిల్లులో హమాలీగా పనిచేస్తు ఇంటిని పోషిస్తున్నాడు. అతని భార్య రమ్య కొన్ని నెలలుగా మద్యానికి బానిసయింది. రమ్యను మద్యం మానమని ఆమె భర్త మల్లేష్ ఎన్నిసార్లు చెప్పినా రమ్య మాత్రం తన అలవాటు మానలేదు. పైగా మద్యం (alcohol) కు బానిసైన రమ్య పాపను పట్టించుకోలేదు. మద్యం మానుకుని పాపను పట్టించుకోమని, లేకుంటే ఇంటి నుండి వెళ్ళపొమ్మని మల్లేష్ మందలించాడు.

దుప్పటి కప్పి గొంతు నులిమి చంపేసింది

తాజాగా ఆ చిన్నారికి జ్వరం రావటం మద్యం కిక్కులో ఉన్న రమ్య మందులు పోయకపోవటంతో జ్వరం ఎక్కువైంది. దీంతో ఇంటికి వచ్చిన మల్లేష్‌ భార్యను మందలించాడు.దీనితో రమ్య ఆదివారం రోజు ఫుల్లుగా మందేసి, తాగిన మైకంలో ఆమె ఐదు నెలల కూతురు అయిన శివాని ని మొహం మీద దుప్పటి కప్పి గొంతు నులిమి చంపేసింది. అయితే రాత్రి సమయంలో ఇంటికి వచ్చిన భర్త కూతురు ఎక్కడ అని అడగగా కూతురు చనిపోయింది అని చెప్పింది. కూతురు శివాని ఎలా చనిపోయిందని అడగగా ఏదో పురుగు కుట్టి చనిపోయిందంటూ బుకాయించింది. అది నమ్మని భర్త మల్లేష్ (Mallesh) గట్టిగా నిలదీయడంతో తాను చేసిన ఘనకార్యం బయటపెట్టింది. దీంతో ఆగ్రహానికి గురైన భర్త మల్లేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రమ్యను అదుపులోకి తీసుకుని, రిమాండ్‌కు తరలించారు.

Nizamabad: మద్యానికి బానిసైన తల్లి.. ఐదు నెలల పసికందును హతమార్చిన వైనం

ఈ సంఘటన

ఈ ఘటన గ్రామమంతా విషాదంలో ముంచెత్తింది. తల్లి చేతిలోనే పసికందు ప్రాణాలు కోల్పోయిన ఘటన చూసి గ్రామస్తులు షాక్‌కు గురయ్యారు. మానవత్వం మరిచిపోయేలా మారిపోయిన రమ్యపై మండిపడుతున్నారు.ఈ సంఘటన మద్యం, మానసిక శరీరం పై ప్రభావం ఎంత తీవ్రమైనదో, కుటుంబాల్లో ఎంత నాశనం చేయగలదో చూపించింది. మద్యం మానలేని అలవాట్లు, మానసిక స్థితిలో ఉన్న లోపాలు సమాజాని (Society) కి ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన దృవీకరిస్తుంది. చిన్నారి శివాని ప్రాణాలు పోవడం వెనుక ఉన్న కారణాలు విచారకరం .

ఆల్కహాల్‌ను ఎవరు తొలిగా కనుగొన్నారు?

ఆల్కహాల్‌ను ఒకే ఒక్క వ్యక్తి కనుగొన్నారు అని చెప్పడం సాధ్యం కాదు. ఇది అనేక వేల సంవత్సరాల క్రితం మనుషుల ప్రక్రియాత్మక ఆచరణల వల్ల తార్కికంగా అభివృద్ధి చెందిన పదార్థం.

ఆల్కహాల్ అంటే ఏమిటి?

ఆల్కహాల్‌ పూర్తి రూపం (Full Form of Alcohol) అనేది ఒక శాస్త్రీయ పరమైన పదం కాదు. అంటే “Alcohol” అనే పదానికి ఎటువంటి ఎక్రోనిమ్ (Acronym) లేదు. కానీ సాధారణంగా ఆల్కహాల్ అంటే శాస్త్రీయంగా ‘ఎథనాల్’ (Ethanol) అనే పదార్థాన్ని సూచిస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: TG Rain: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు

AlcoholAddictionCrime Breaking News ChildMurderCase latset news MotherKillsDaughter NizamabadTragedy TelanganaCrimeNews Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.