📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Nimisha Priya: నిమిష ఉరిశిక్ష రద్దుపై కేంద్రం ఏమన్నదంటే..

Author Icon By Sharanya
Updated: July 29, 2025 • 2:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యెమెన్ ఉరిశిక్షను ఎదుర్కొంటున్న నర్సు నిమిష ప్రియ (Nimisha Priya) ఉరిశిక్ష రద్దుపై కేంద్రప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు యెమెన్ ప్రభుత్వం (Government of Yemen) విధించిన ఉరిశిక్షను రద్దు చేస్తున్నట్లు ఇటీవల భారత గ్రాండ్ ముఫ్టీ, సున్నీలీడన్ కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ప్రకటించింది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని, నిమిష ఉరిశిక్ష రద్దు కాలేదని కేంద్ర విదేశాంగశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆమె ఉరిశిక్ష వాయిద మాత్రమే పడిందని, రద్దు కాలేదని అధికారులు తెలిపారు.

ఉత్కంఠంగా సాగుతున్న నిమిష ఉరిశిక్ష

ఈ కేసు పూర్వాపరాలను ఓసారి గమనిస్తే కేరళకు చెందిన నిమిష ప్రియ (Nimisha Priya) 2008లో తన నర్సింగ్ కోర్సు పూర్తిచేసుకుని, యెమెన్కు వెళ్లింది. 2011లో కేరళకు వచ్చి, థామస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. యెమన్ సొంతంగా క్లీనిక్ను ఏర్పాటు చేయాలని భావించిన నిమిష, ఆదేశ నియమాల ప్రకారం స్థానిక తలాల్ అబ్దో మహ్దీ (Talal Abdo Mahdi) వ్యక్తి వ్యాపార భాగస్వామ్యంతోనే క్లీనిక్ని ప్రారంభించింది. నిమిష భర్త, కూతురు కేరళలో నివసిస్తుండగా నిమిష ఒంటరిగా యెమెన్లోనే ఉండిపోయింది. దీన్ని ఆసరగా చేసుకొని మెహది నిమిషను డబ్బు లాక్కుని, వేధించేవాడు. నిమిష పాస్పోర్టును కూడా లాక్కుని, మరింతగా హింసించసాగాడు. దీంతో నిమిష మెహదికి మత్తుమందు ఇచ్చి, అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే డోస్ ఎక్కువై మెహది మరణించాడు. దీంతో అతడి మృతదేహాన్ని వాటర్ ట్యాంక్లో పడేసింది.

సరిహద్దులో అరెస్టు, ఉరిశిక్ష ఖరారు

నిమిష సౌదీకి వెళ్లేందుకు ప్రయత్నించగా అధికారులు ఆమెను అరెస్టు చేశారు. కోర్టు నిమిషకు ఉరిశిక్ష విధించింది. మృతుడి కుటుంబానికి భారీమొత్తంలో పరిహారంగా డబ్బు ఇస్తే, వారు ఆమెను క్షమిస్తే, ఉరిశిక్ష రద్దు అవుతుంది. ప్రస్తుతం దీనిపై ఎలాంటి సమాచారం లేదు.

Read hindi news: hindi.vaartha.com

Read also: Doctor negligence: ఎమర్జెన్సీ వార్డులో వైద్యుడి మొద్దునిద్ర.. పేషెంట్ మృతి.. వీడియో వైరల్

Breaking News Centre response Nimisha Priya death penalty appeal Indian nurse death latest news Nimisha Priya Yemen court Yemen death penalty

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.