📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

News Telugu: Uttar Pradesh – మహిళకు నిప్పంటించిన దుండగుడు.. మంటల్లోనే స్వయంగా ఆసుపత్రికి వచ్చిన వైనం

Author Icon By Rajitha
Updated: September 9, 2025 • 3:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) మరోసారి మహిళా భద్రతపై ప్రశ్నార్థక చిహ్నం వేసే సంఘటన వెలుగులోకి వచ్చింది. ఫరూఖాబాద్ (Farrukhabad) సమీపంలో జరిగిన ఈ ఘటన స్థానికులను కలవరపరిచింది. 33 ఏళ్ల నిషా సింగ్ అనే మహిళపై ఓ దుండగుడు కిరాతకంగా దాడి చేసి ప్రాణాలు తీశాడు.

ఘటన ఎలా జరిగింది?

నిషా సింగ్ వివాహిత. ఆమెను కొంతకాలంగా దీపక్ అనే వ్యక్తి తరచూ వేధిస్తున్నాడు. తనతో మాట్లాడాలని, సంబంధం కొనసాగించాలని ఒత్తిడి చేస్తున్నాడట. నిషా తిరస్కరించడంతో అతడు మరింతగా హింసించేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.(Uttar Pradesh) ఈ వేధింపులు తాళలేక ఆమె ఇటీవలే తన తండ్రి ఇంటికి వెళ్ళింది. ఒకరోజు అక్కడి నుంచి స్కూటీపై బయలుదేరిన నిషాను దీపక్ గమనించాడు. వెంటనే స్కూటీకి అడ్డంగా వచ్చి ఆపేశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో దీపక్ తన స్నేహితులతో కలిసి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటల్లో చిక్కుకున్న నిషా కేకలు వేస్తూనే స్కూటీ నడిపి సమీప ఆసుపత్రికి చేరుకోవడం చూసినవారు దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఆసుపత్రిలో చికిత్స ఫలించలేదు

మంటల్లో 80 శాతం కాలిన నిషాను తొలుత స్థానిక ఆసుపత్రిలో (Hospital) చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో లక్నోలోని మరో హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే ఆమె గాయాలు తీవ్రంగా ఉండటంతో వైద్యులు కాపాడలేకపోయారు. ఈ ఘటన విన్న వారందరూ షాక్‌కు గురయ్యారు. దీపక్ కొంతకాలంగా మా చెల్లిని వేధిస్తున్నాడు. ఎప్పుడూ ఫోన్ చేసి, ఇంటి దగ్గర వేచి చూసి ఇబ్బందులు పెట్టేవాడు. నిషా ఈ విషయం చాలాసార్లు చెప్పింది. చివరికి ఇలాంటి కిరాతకం చేశాడు” అని బాధితురాలి సోదరి నీతూ సింగ్ కన్నీటి పర్యంతమయ్యారు. నిషా తండ్రి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ “నా కూతురి ప్రాణాలు తీసిన దుండగుడిని కఠినంగా శిక్షించాలి” అని డిమాండ్ చేశారు.

పోలీసులు రంగంలోకి

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. నిషా తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడు దీపక్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని అధికారులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/ys-viveka-viveka-murder-case-hearing-postponed-once-again-in-supreme-court/crime/543928/

Breaking News Deepak accused Farukkhabad incident latest news Nisha Singh case scooter burning case Telugu News uttar pradesh crime woman set on fire

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.