Nellore Tragedy: నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సరదాగా బీచ్‌కి వెళ్లిన ముగ్గురు స్నేహితులు సముద్రపు అలల ఉధృతికి గల్లంతయ్యారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోగా, మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు.
Read Also: Rajasthan: ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం
ఏం జరిగింది?
ఉలవపాడు బీచ్‌లో ఈత కొట్టేందుకు దిగిన ముగ్గురు యువకులు సముద్రంలో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న మెరైన్ పోలీసులు వెంటనే స్పందించి గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసుల సహాయంతో ఒక యువకుడు సురక్షితంగా బయటపడగా, మిగిలిన ఇద్దరు విగతజీవులుగా లభ్యమయ్యారు.
మృతుల వివరాలు
మృతులను దీపక్ (18) మరియు లోకేష్ (23) గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: