National Commission for Women : మేడారంలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరగలేదు

Read Time:  1 min
NCW : మేడారంలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరగలేదు
NCW : మేడారంలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరగలేదు
FONT SIZE
GET APP

హైదరాబాద్ : ములుగు జిల్లాలో జరిగిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా 13 ఏళ్ల బాలికపై జరిగినట్లుగా వస్తున్న అత్యాచార ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్ (NCW) తీవ్రంగా స్పందించింది. ఈ అమానుష ఘటనపై కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేయడమే కాకుండా, వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు గురువారం ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.

Read Also: Telangana: నేడు బీజేపీ మేనిఫెస్టో రిలీజ్

NCW: No gang rape of minor girl in Medaram

తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ విచారణ

మేడారం జాతరలో ఒక మైనర్ బాలికపై యువకులు అత్యాచారానికి(Rape) పాల్పడినట్లుగా ఆరోపణలు చోటు చేసుకున్నదానిపై జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహాత్కర్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు. ఈ ప్రత్యేక విచారణ కమిటీకి ఎన్సీడబ్ల్యూ సభ్యురాలు డెలినా ఖోంగ్డప్ అధ్యక్షత వహించనుండగా, సీనియర్ కోఆర్డినేటర్ కంచన్ ఖట్టర్ సభ్యురాలిగా వ్యవహరించినున్నారు. ఈ విచారణ కమిటీకి ములుగు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీతో నియమించబడిన ఓ న్యాయవాది సహకరిస్తారని జాతీయ మహిళా కమిషన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఈ కమిటీ గురువారం ములుగు జిల్లాకు వెళ్లి విచారణను ప్రారంభించింది. మహిళా కమిషన్ సభ్యురాలు డెలినా, కంచన్ కట్టర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ మధ్యాహ్నం ములుగు జిల్లాకు చేరుకుంది. ములుగు కలెక్టరేట్లో కలెక్టర్ దివాకర, ఎస్పీ రామ్ నాథ్ కేకన్ తో విచారణ కమిటీ భేటీ అయింది. అనంతరం మేడారం జాతర పరిసరాలలో గ్యాంగ్ రేప్ జరిగిందని భావిస్తున్న ప్రాంతం పరిశీలన చేసింది. జాతరలో ఎలాంటి గ్యాంగ్ రేప్ ఘటన జరగలేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. పోలీసుల నుండి లిఖిత పూర్వక రిపోర్ట్ వచ్చాక జాతీయ మహిళా కమిషన్కు ఫైనల్ నివేదిక అందించనున్నట్లు ఎంక్వయిరీ బృందం తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.