ఇద్దరు పిల్లలకు విషమిచ్చి ఆపై కాల్వలో తోసేసి..తండ్రి ఆత్మహత్యాయత్నం.. పరిస్థితి విషమం నారాయణపేట జిల్లా మరికల్లో ఘటన భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపం చెందిన భర్త తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపి తాను కూడా పురుగు మందు తాగి ఆత్మహ త్యాయత్నానికి పాల్పడ్డ హృదయ విదా రక ఘటన నారాయణపేట జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే నారాయణపేట జిల్లా తీలేరు గ్రామానికి చెందిన శివరాములుకు రిత్విక (8) చైతన్య (5) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతంలో భార్యవిడాకులు తీసుకుని వెళ్లిపోవడంతో పిల్లలను తన వద్ద ఉంచుకొని జీవనం సాగిస్తున్నాడు.
Read also: Telangana: డ్రగ్స్ కేసు.. హైకోర్టును ఆశ్రయించిన నటి రకుల్ సోదరుడు

mental stress, two young children fall victim
చిన్నారులను కాలువలో తోసి చంపినట్లు
ఈ క్రమంలో భార్య తిరిగి కాపురానికి రావడంలేదని మనస్థాపానికి గురై మానసిక ఒత్తిడికి లోనై తన ఇద్దరు చిన్నారులకు విషం తాగించినట్లు తెలుస్తుంది. అయితే విషం తాగించినప్పటికీ వారు మృతి చెందకపోవడంతో సమీపంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు కాలువ వద్దకు తీసుకెళ్లి చిన్నారులను కాలువలో తోసి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన కాల్వ వద్దకు చేరుకుని ఇద్దరు చిన్నారుల దేహాలను వెలికి తీసి అప్పటికే వారు మృతి చెందినట్లు నిర్ధారించారు. చిన్నారులను వేసిన అనంతరం శివరాములు కూడా అదే క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
అప్పటికి తాను మృతి చెందలేదని గుర్తించి కరెంటు ట్రాన్స్ఫార్మర్ ను తాకి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నం చేసినట్లు చుట్టుపక్కల వారు చెబుతున్నారు. ప్రస్తుతం శివరాములు తీవ్రంగా గాయపడి దవఖానలో చికిత్స పొందుతున్నాడు. అభం శుభం తెలియని చిన్నారులపై కర్కశత్వం ప్రదర్శించడానికి తండ్రికి చేతులు ఎలా వచ్చాయని గ్రామస్తులతో పాటు విషయం తెలిసిన వారంతా మండిపడుతున్నారు. ఈ మేరకు మరికల్ ఎస్సై రాము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: