Nandyala Road Accident: నంద్యాల జిల్లా డోన్ మండలం జగదుర్తి వద్ద జాతీయ రహదారిపై హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి తిరుపతి వైపు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి రోడ్డుపై ఉన్న క్రేన్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
Read also: Bihar: పెళ్లి వేదికలో వధువుపై కాల్పులు
వివరాల్లోకి వెళ్తే:
బెంగళూరుకు చెందిన ప్రమోద్ తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. జగదుర్తి గ్రామ సమీపానికి చేరుకోగానే, వీరి వాహనం ముందు వెళ్తున్న క్రేన్‌ను ఢీకొట్టింది. ఈ ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. కారులో ఉన్న ప్రమోద్ భార్య, కుమారుడు మరియు కుమార్తె తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మరణించారు.
ప్రమాద సమయంలో డ్రైవింగ్ సీటులో ఉన్న ప్రమోద్ తీవ్రంగా గాయపడగా, గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆయన్ను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: