📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

Namrata: డాక్టర్ నమ్రత అక్రమాలు.. వెలుగులో సంచలన విషయాలు

Author Icon By Ramya
Updated: August 6, 2025 • 1:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Namrata: పెళ్లైన జంటలు తమ ప్రేమకు చిహ్నంగా పిల్లలు పుట్టాలని కోరుకుంటారు. అందుకోసం ఆనందంగా నిరీక్షిస్తారు. కొందరు పెళ్లైన వెంటనే సంతానం కావాలనుకుంటారు. మరికొందరైతే రెండుమూడేళ్ల తర్వాత పిల్లల కోసం ప్లాన్ చేసుకుంటారు. ఏ జంటైనా పిల్లలు కనాలనే కోరుకుంటారు. సంతానంతో అందమైన భవిష్యత్తుకు ప్రణాళికలు చేసుకుంటారు. కానీ కొందరికి శారీరక లోపం వల్ల సంతానయోగ్యాన్ని పొందలేరు. దంపతుల్లో ఎవరిలో లోపం ఉన్నా బిడ్డల్ని కనడం కష్టమే అవుతుంది. తద్వారా వైద్యులను సంప్రదిస్తారు. సంతానం కోసం ఎంత డబ్బు అయినా ఖర్చుపెట్టేందుకు వెనుకాడరు. సరిగ్గా ఇలాంటివారి బలహీనతలే కొన్ని సంతాన సాఫల్యకేంద్రాలకు ఆధారంగా ఉంటున్నాయి. సంతాన సాఫల్యం (Childbirth) ముసుగులో డాక్టర్ నమ్రత (Namrata) అడ్డగోలు సంపాదనకు తెగించి, చివరికి పోలీసుల వరకు వెళ్లడంతో అసలు కథ బాహ్యప్రపంచానికి తెలిసింది.

Namrata

వెలుగులో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆక్రమాలు

గత వారం అరెస్టయిన డాక్టర్ నమ్రత (Namrata) కస్టడీ నిన్నటితో ముగియడంతో కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఆమెను చంచల్గూడ జైలుకు తరలించారు. డాక్టర్ నమ్రత, విశాఖ సృష్టి కేంద్రం మేనేజర్ కళ్యాణి, ఏజెంట్గా వ్యవహరించిన మరో నిందితురాలు సంతోష ముగ్గురినీ నార్త్ జోన్ కార్యాలయంలో (North Zone Office) ఒకేచోట ఉంచి ప్రశ్నించారు. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించేసరికి అసలు నిజాలు చెప్పారు నమ్రత.

80 వరకు ఫేక్ సరోగసీ కేసులు

దాదాపు 80 ఫేక్ సరోగసీ కేసులు చేసినట్టు అంగీకరించారు. ఒక్కొక్కరికి దగ్గర 20 నుంచి 30 లక్షలు దండుకున్నట్లు ఒప్పుకున్నారు డాక్టర్ నమ్రత. ఈ దందాలో తమకు సహకరించిన అనస్థీషియా డాక్టర్ సదానందమ్కు భారీ నజరానా ఇచ్చినట్టు, సబ్ ఏజెంట్లకు కమీషన్ ఇచ్చినట్టు కూడా కస్టడీలో అంగీకరించారమె. ఆసోమ్, బీహార్, ముంబై, రాజస్థాన్ నుంచి పసికందుల్ని కొనుగోలు చేసి చైల్డ్ ట్రాఫికింగ్కు పాల్పడ్డారట. విశాఖలో నమోదైన కేసులో హైదరాబాద్లో ఏంటి ఈ హడావిడి అంటూ డాక్టర్ నమ్రత వాదనలు చేయడం విడ్డూరం.

ఇతరులకు పుట్టిన పిల్లల్ని సరోగసి పేరుతో అమ్మకాలు

సంతానలేమితో బాధపడుతూ ఐవిఎఫ్ కోసం వచ్చిన వారిని మాయమాటలతో సరోగసీకి ఒప్పించి లక్షల్లో డబ్బు దండుకోవడం సృష్టి మేజిక్ మొదటి మెట్టు. గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు పెట్టి, ఏజెంట్ల సహకారంతో పేద మహిళల్ని ఉచ్చులోకి దింపడం సెకండ్ స్టెప్. విశాఖ, విజయవాడకు తరలించి వారికి పుట్టిన సరోగసీ పేరటుతో వేరే దంపతులకు కట్టబెట్టడం మూడో మెట్టు. మీరిచ్చిన బిడ్డ తమ బిడ్డ కాదని ఎవరైనా ఎదురు తిరిగితే బెదిరించి భయపెట్టడం
చిన్నారులను కళ్యాణి బాధ్యతగా తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు 12మందిని ఆరెస్టు చేసి, 6 ఎఫ్ఎస్ఐఆర్ కేసులు నమోదు చేశారు పోలీసులు.

డాక్టర్ నమ్రతపై ఆరోపణలు ఏమిటి?

డాక్టర్ నమ్రత 80 ఫేక్ సరోగసీ కేసులు చేసి, పసికందుల్ని కొనుగోలు చేసి చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.

ఈ స్కామ్‌లో ఇతరులు ఎవరు పాత్రధారులు?

ఈ కేసులో డాక్టర్ నమ్రతతో పాటు సృష్టి మేనేజర్ కళ్యాణి, ఏజెంట్ సంతోష, డాక్టర్ సదానందం సహకరించినట్టు విచారణలో బయటపడింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/ap-cabinet-meeting-key-decisions-chandrababu/andhra-pradesh/526796/#google_vignette

Breaking News child-trafficking dr-namrata fertility-center-fraud latest news surrogacy-scam Telugu News visakhapatnam-case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.