📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Nalgonda: ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ

Author Icon By Tejaswini Y
Updated: January 31, 2026 • 3:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Nalgonda (నాంపల్లి): వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతున్నాయి. ప్రియుడి కోసం ఏకంగా అతని భార్యనే అంతమొందించిన దారుణ ఘటన నల్గొండ జిల్లా నాంపల్లి (Nampally Murder) మండలంలోని కేతేపల్లిలో చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందనే నెపంతో ఒక మహిళ, మరో మహిళపై పెట్రోల్ పోసి సజీవదహనం చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Read Also: AP: పల్నాడు జిల్లా మాచర్లలో పిచ్చికుక్క బీభత్సం

Nalgonda crime

వివాహేతర సంబంధమే కారణం

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. కేతేపల్లికి చెందిన నగేష్ అనే వ్యక్తికి సుజాత అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంలో నగేష్ భార్యకు, సుజాతకు మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. తమ సంబంధానికి నగేష్ భార్య అడ్డుపడుతోందని సుజాత కక్ష పెంచుకుంది.

పెట్రోల్ పోసి దారుణ హత్య

శనివారం ఈ వివాదం ముదిరింది. ఆవేశానికి లోనైన సుజాత, వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను నగేష్ భార్యపై పోసి నిప్పంటించింది. మంటలు వేగంగా వ్యాపించడంతో బాధితురాలు తప్పించుకునే అవకాశం లేక అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. నిందితురాలు సుజాత చేసిన ఈ ఘాతుకాన్ని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న నాంపల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితురాలు సుజాతను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నగేష్ పాత్రపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Extra Marital Affair Crime Kethepally Murder Incident Nalgonda Crime News Nampally Murder Case Petrol Attack Nalgonda Telangana Crime News Woman Burnt Alive Nalgonda

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.