📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Nalgonda Crime: మద్యం మత్తులో తండ్రిని పొట్టనబెట్టుకున్న కొడుకు

Author Icon By Tejaswini Y
Updated: February 20, 2026 • 2:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Nalgonda Crime: నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని బండమీదిగూడెంలో గురువారం రాత్రి ఒక దారుణమైన ఘటన జరిగింది. మద్యానికి బానిసైన కొడుకు కిరాతకానికి కన్నతండ్రి బలయ్యాడు. నిత్యం మద్యం తాగి కుటుంబ సభ్యులతో గొడవపడే అలవాటు ఉన్న బాలకృష్ణ అనే యువకుడు, గురువారం రాత్రి కూడా ఫుల్‌గా తాగి వచ్చి ఇంట్లో రభస చేశాడు.

Read Also: Kokapet crime: డాక్టర్ ఇంట్లో పని చేసే యువతి బలవన్మరణం!

Nalgonda Crime: Son kills father while intoxicated

అక్కడికక్కడే మృతి

తండ్రి బుర్రే సత్తయ్య (60) తన కొడుకును వారించే ప్రయత్నం చేయగా, ఆగ్రహానికి గురైన బాలకృష్ణ తండ్రిని రోడ్డుపైకి బలంగా నెట్టివేశాడు. ఈ క్రమంలో సత్తయ్య తలకు తీవ్రమైన గాయం కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రి(Nakrekal Hospital)కి తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

crime news Telugu Father Murdered nalgonda crime Nalgonda Crime News Nalgonda Latest News Shaligowraram News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.