📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Nagarkurnool Crime: ముగ్గురు విద్యార్థినులపై క్లాస్ మెట్ అఘాయిత్యం

Author Icon By Anusha
Updated: March 13, 2026 • 10:53 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Nagarkurnool Crime: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో సభ్యసమాజం తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి, ప్రేమ పేరుతో తోటి విద్యార్థినులను నమ్మించి వంచించాడు. ముగ్గురు విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, ఆ దృశ్యాలను తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. అనంతరం ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని, వారి తల్లిదండ్రులకు పంపిస్తానని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేయడం ప్రారంభించాడు.

Read Also: Nellore Crime: ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

గర్భం దాల్చిన బాధితురాలు.. గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్

నిందితుడి వేధింపులు భరించలేకపోయిన బాధితురాళ్లలో ఒకరు ధైర్యం చేసి విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో వారు సదరు విద్యార్థిని పట్టుకుని దేహశుద్ధి చేసి, అతడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికరమైన నిజాలు బయటపడ్డాయి. బాధితుల్లో ఒక బాలిక గర్భం దాల్చగా, కొల్లాపూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి అబార్షన్ చేయించినట్లు నిందితుడు అంగీకరించాడు.

Nagarkurnool Crime: Inter student assaults three girls

ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పోలీసులు, నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ చేసినందుకు సదరు ప్రైవేట్ ఆసుపత్రిలోని స్కానింగ్ సెంటర్‌ను బుధవారం సీజ్ చేశారు. గురువారం ఇద్దరు డాక్టర్లు, ఒక నర్సును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రధాన నిందితుడైన విద్యార్థిని జువైనల్ హోంకు తరలించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

crime news Telugu Nagarkurnool Crime sexual assault case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.