📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Congress Leader Murder: నాగర్ కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ నేత దారుణ హత్య

Author Icon By Sharanya
Updated: July 14, 2025 • 3:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ రాష్ట్రం నాగర్‌కర్నూల్ జిల్లాలోని కల్వకోల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు (Congress Leader Murder) కర్నాటి దామోదర్ గౌడ్ (48) హత్యకు గురైన ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ ఘటన స్థానికంగా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

అదృశ్యం… చివరకు మృతదేహం

దామోదర్ గౌడ్ (Damodar Goud) రెండు రోజులుగా కనిపించకుండా పోవడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి సీరియస్‌గా దర్యాప్తు ప్రారంభించారు. అన్వేషణలో భాగంగా పోలీసులకు సింగోటం రిజర్వాయర్‌ (Singotam Reservoir) లో ఓ శవం తేలిందని సమాచారం రావడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. చివరికి అది దామోదర్ గౌడ్ శవంగా గుర్తించారు.

హత్య వెనుక కారణాలు – వివాహేతర సంబంధమే ముప్పు?

దామోదర్ గౌడ్ కు అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సదరు మహిళతో గడిపేందుకు వెళ్లాడు. దామోదర్ గౌడ్ ఆ మహిళతో సన్నిహితంగా ఉండగా సదరు మహిళ భర్త, కొడుకు గమనించారు. ఆగ్రహం పట్టలేక ఇద్దరిపైనా దాడి చేసి దామోదర్ గౌడ్ ను కొట్టి చంపారు. ఆ తర్వాత శవాన్ని సంచిలో మూటకట్టి తీసుకెళ్లి ఎంజీకేఎల్ కెనాల్ లో పడేశారు. రెండు రోజుల తర్వాత దామోదర్ గౌడ్ మృతదేహం సింగోటం రిజర్వాయర్ లో తేలింది.

పోలీసుల విచారణ – ముగ్గురు అదుపులో

ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం ఆ మహిళను, ఆమె భర్త, కుమారుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: TG Rains: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు పలు జిల్లాల్లో వర్షాలు

Breaking News CongressLeaderMurder DamodarGoudMurder latest news NagarkurnoolCongress NagarkurnoolNews Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.