📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Telugu News: Mysore: ఏనుగు నుంచి తప్పించుకుని.. పులికి బలైన రైతు

Author Icon By Tejaswini Y
Updated: November 7, 2025 • 3:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అడవిలో ఉండాల్సిన క్రూరమృగాలు జనాల్లోకి వస్తున్నాయి. ఆవును అడవులను మనం నాశనం చేస్తూ, వాటికి నివాసం, ఆహారం లేకుండా చేస్తుంటే అవి ఊర్లల్లోకి వచ్చి మనుషులను చంపుతున్నాయి. మనల్ని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మన స్వార్థంతో అరణ్యాలను పాడుచేస్తున్నాం. వన్యప్రాణులకు నివాసం లేకుండా చేస్తున్నాం. అందుకే ఇటీవల క్రూరమృగాలు గ్రామాల్లోకి, పంటచేనిల్లోకి వస్తున్నాయి. తాజాగా, కర్ణాటకలోని మైసూరు(Mysore) జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలో పులి దాడి చేయడంతో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటనతో స్థానిక గ్రామాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండడంతో అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also:  Amit Shah: వందేమాత‌ర గీతం దేశ ఐక్య‌త‌, దేశ‌భ‌క్తి, యువ‌త‌లో ఉత్తేజానికి మూలం: కేంద్ర మంత్రి

రైతుపై పులి దాడి,, తలను తినేసింది..

మైసూరు(Mysore) జిల్లా సరగూరు తాఊకాలోని హళేహెగోడీలు గ్రామానికి చెందిన దండా నాయక అలియాస్ స్వామి (58) అనే రైతు పొలానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. నూగు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం పరిధిలో పులి ఆయనపై దాడి చేసి చంపేసింది. అనంతరం మృతుడి తల, తొడ భాగాలను తినేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. కాగా, మృతుడు 8నెలల క్రితం ఏనుగు దాడి నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇప్పుడు పులి దాడిలో మరణించడంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

పులుల దాడుల్లో రైతులు

మరణించడం గత కొన్ని నెలల్లో ఇది మూడోసారి కావడంతో స్థానికుల్లో ఆందోళన పెరిగిపోయింది. అక్టోబర్ 26న సరగూరు తాలూకాలోని ముల్లూరు గ్రామ సమీపంలో రాజశేఖర(54) అనే రైతు పశువులను మేపుతుండగా పులి దాడిలో మరణించాడు. ఆ ఘటన జరిగినప్పుడు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చిన ఆటవీశాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేను
గ్రామస్తులు అడ్డుకుని నిరసన తెలిపారు. పులి కదలికలను గుర్తించినా, అధికారులు బోను ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని వారు ఆరోపించారు.

రైతు సంఘాల ఆగ్రహం

వరుస ఘటనలపై ప్రభుత్వం స్పందించకపోవడంపై రైతు సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల సనిర్లక్ష్యం వల్లే రైతులు ప్రాణాలు కోల్పోతున్నారని, అవసరమైతే
వారిపై కేసులు పెడతామని హెచ్చరించారు. దీనిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు.

తన సొంత జిల్లా మైసూరుతో పాటు పక్కనే ఉన్న చామరాజనగర్ జిల్లాల్లో పులుల దాడులు పెరగడంపై త్వరలోనే మంత్రులు, అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. పులులు, ఏనుగులు సంచరిస్తుంటే అటవీశాఖ అధికారులు గ్రామాల్లోని
ప్రజలను, రైతులను అప్రమత్తం చేస్తుండాలి. వాటి రాకడను అరికట్టాలి. వెంటనే వాటిని బంధించి, తిరిగి అడవిలోకి వదిలేయాలి. అప్పుడే వీటి భారీనుంచి ప్రజల ప్రాణాలు కాపాడ
బడతాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

    ElephantAttack ForestDepartment HumanWildlifeConflict KarnatakaGovernment KarnatakaNews MysuruNews SouthIndiaNews TigerAttack WildlifeConservation

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.