📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Murder: స్నేహితుల మధ్య వాగ్వాదంతో ఒకరిపై ఒకరు దాడి

Author Icon By Sharanya
Updated: July 1, 2025 • 3:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Murder: కూకట్‌పల్లిలో చోటు చేసుకున్న ఈ దారుణం పోలీసు వర్గాలను, స్థానిక ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. స్నేహితుల మధ్య చిన్న వాగ్వాదం ఒకరి ప్రాణాలను తీసే స్థాయికి దారితీయడం ఆందోళన కలిగించే విషయం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడవుతున్న కొద్దీ, నిందితుల పాఠశాల స్థాయి నుండి ప్రారంభమైన నేర చరిత్రలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సంఘటనను క్రిమినల్ మానసికత, మద్యం ప్రభావం, అంతరాళంలో ఉన్న పగలు, భయభ్రాంతులు కలగలిపిన ఘోరమైన ఉదంతంగా పోలీసులు చెబుతున్నారు.

Murder

మద్యం, నేరబుద్ధులు మిశ్రమం – ప్రాణహాని

సాధారణంగా స్నేహితుల మధ్య జరిగే జన్మదిన వేడుక, మద్యం మత్తులో నేరానికి మారడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన మళ్లీ రుజువు చేసింది. పోలీసుల వివరాల ప్రకారం, అల్లాపూర్​కు చెందిన సయ్యద్​ షాహీద్ (Shahid)​ (23) ఖాళీగా ఉంటున్నాడు. సనత్​నగర్​ (Sanathnagar) పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడు. ఇతడిపై సంవత్సరం కిందట అల్లాపూర్​ ఠాణాలో రౌడీ షీట్​ నమోదైంది.

ముఠాల మాయాజాలం – నాశనం వైపు యువజనులు

షాహీద్​, మౌలాలికి చెందిన సాజీద్​, కూకట్​పల్లికి చెందిన పవన్, బోరబండకు చెందిన మున్నా, సమీర్​లు కలిసి ఓ గ్యాంగ్​గా ఏర్పడ్డారు. ఆదివారం పవన్​ పుట్టినరోజు కావడంతో పార్టీ చేసుకుందామని నలుగురు మిత్రులు షాహీద్​ను ఆహ్వానించారు. ఐదుగురు కలిసి కూకట్​పల్లి వడ్డేపల్లి ఎన్​క్లేవ్​ ఎదురుగా ఉన్న పెట్రోల్​ బంకు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో పవన్​తో కేక్ కట్​ చేయించారు. పొద్దుపోయే వరకు అక్కడే మద్యం తాగారు. ఆ సమయంలో షాహీద్​కు, మిత్రులకు మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలిస్తోంది.

తలపై మోది దాడి

దీంతో నలుగురు కలిసి మద్యం సీసాలను పగులగొట్టి షాహీద్​ గొంతులో పలుమార్లు పొడిచారు. బండరాళ్లతో తలపై మోదడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. షాహీద్​కు​ భార్య షమీం బేగం, మూడేళ్లు, 11 నెలల కుమార్తెలున్నారు. డబ్బులు డిమాండ్​ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నందుకే షాహీద్​కు ప్లాన్​ ప్రకారమే నిందితులు మట్టుబెట్టినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు కూకట్​పల్లి ఏసీపీ ఇ.రవి కిరణ్​రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. నిందితుల్లో ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.

తండ్రి నుంచి కుమారుడికి నేర గుణస్వభావం

షాహీద్​ తండ్రి వాహేద్​ సైతం రౌడీషీటరే. ఆయన 2016 ఆగష్టు 9న గ్యాంగ్​స్టర్​గా అనుచరుల చేతిలోనే హత్యకు గురయ్యారు. తండ్రిలా షాహీద్​ కూడా నేరాల బాట పట్టి ముఠాకు నాయకత్వం వహిస్తూ వచ్చాడు. గంజాయి, మద్యం సేవించి పలువురిపై దాడులకు పాల్పడే వాడు. చోరీ చేసిన సొత్తు పంపకం విషయంలో ఏర్పడిన గొడవలో భరత్​ నగర్​ వంతెన కింద సహచరుడిని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా షాహీద్​ ఉన్నాడు. ఇతని సోదరుడైన జాహీద్​ సైతం ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడు.

Read also: Sigachi Blast: ఆశలన్నీ కన్నీరయ్యే..ప్రమాదంలో మృతి చెందిన దంపతులు

Bhopal: ప్రియురాలిని చంపీ బెడ్‌షీట్‌లో చుట్టి.. ఇంట్లోనే 3 రోజుల పాటు..

#BirthdayPartyViolence #crimenews #DrunkenViolence #FriendshipTurnsFatal #Hyderabad #KukatpallyMurder #RowdySheeterKilled #telangana Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.