📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు భూ తగాదాల్లో తల్లీకొడుకు దారుణహత్య భార్య అందంగా ఉందని గుండు గీసిన సైకో భర్త ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Suicide: నీటిలోకి దూకిన ముంబై జేజే హాస్పిటల్ డాక్టర్

Author Icon By Vanipushpa
Updated: July 9, 2025 • 5:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భోజనానికి ఇంటికి వస్తున్నానని తల్లికి ఫోన్ చేసి చెప్పిన ఒక యువ వైద్యుడు(Doctor) కొద్దిసేపటికే వంతెనపై నుంచి నీటిలోకి దూకిన ఘటన ముంబై(Mumbai)లో తీవ్ర కలకలం రేపింది. ఆసుపత్రి నుంచి ఇంటికి బయలుదేరిన ఆయన మార్గమధ్యలో ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ముంబైలోని ప్రఖ్యాత జేజే హాస్పిటల్‌(JJ Hospital) పనిచేస్తున్న డాక్టర్ ఓంకార్ (32) జూలై 7వ తేదీ రాత్రి విధులను ముగించుకుని కారులో ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో తన తల్లికి ఫోన్ చేసి భోజనానికి వస్తున్నట్లు తెలిపారు. అయితే, రాత్రి సుమారు 9:40 గంటల సమయంలో ముంబైని నవీ ముంబైతో కలిపే అటల్ సేతు వంతెనపై తన కారును ఆపారు. ఆ తర్వాత ఒక్కసారిగా వంతెన పైనుంచి నీటిలోకి దూకేశారు.

నీటిలోకి దూకిన ముంబై జేజే హాస్పిటల్ డాక్టర్

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు

గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, వంతెనపై ఆపి ఉన్న కారును, అందులోని ఐఫోన్‌ను గుర్తించారు. కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ఆ వ్యక్తి డాక్టర్ ఓంకార్‌గా నిర్ధారించారు. ప్రస్తుతం కోస్ట్ గార్డ్ సిబ్బంది, పోలీసులు సంయుక్తంగా డాక్టర్ ఓంకార్ ఆచూకీ కోసం రెండు రోజులుగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇంటికి భోజనానికి వస్తున్నానని చెప్పిన ఆయన, ఇంతటి తీవ్ర నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్నది మిస్టరీగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Sports : కోహ్లీతో నాకు పరిచయం ఉంది : నోవాక్ జొకోవిచ్

#telugu News Doctor Incident JJ Hospital mental health Mumbai News suicide attempt

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.